Indians:అమెరికా సరిహద్దులో దొరికిన 10,382 మంది భారతీయులు

అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ ఈ ఏడాది జనవరి నుంచి మే మధ్యలో 10,382 మంది భారతీయులు (Indians) దొరికిపోయారు. వీరిలో పెద్దల రక్షణ లేని 30 మంది మైనర్లు (Miners )కూడా ఉన్నారు. అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించిన వారిలో కూడా అత్యధికంగా గుజరాత్ (Gujarat) రాష్ట్రానికి చెందిన వారు ఉండటం గమనార్హం. ఈ వివరాలను అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ విభాగం (US Customs and Border Protection Department) విడుదల చేసింది. ఇటీవల కాలంలో అమెరికా సరిహద్దుల్లో భద్రతా చర్యలు కట్టుదిట్టం కావడంలో అక్రమ వలసదారులను భారీ సంఖ్యలో అరెస్టు చేస్తున్నారు. గతేడాది ఇదే సీజన్‌లో మొత్తం 34,535 మంది భారతీయులు అక్రమంగా చొరబడుతూ పట్టుబడ్డారు. ఈ లెక్కన ఈ ఏడాది సుమారు 70 శాతం తగ్గుదల నమోదైంది. 2024 ఆర్థిక సంవత్సరంలో తల్లిదండ్రులు (Parents) వదిలేసిన 500 మైనర్లను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అమెరికాలో 2.2 లక్షల మంది భారతీయులు ఎటువంటి పత్రాలు లేకుండా జీవిస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి 332 మందిని అక్కడి నుంచి వెనక్కి పంపారు.