TANA: ఒహాయోలో తానా క్రికెట్ టోర్నీ.. ఆడాలంటే ఏం చెయ్యాలంటే?

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) ఒహాయో వ్యాలీ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నీ (Cricket Tournament) జరగనుంది. డబ్లిన్‌లోని వయాండోట్ వుడ్స్‌లో సెప్టెంబరు 13వ తేదీన ఈ టోర్నీ మొదలవుతుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మ్యాచులు జరుగుతాయి. ఈ టోర్నీలో (Cricket Tournament) పాల్గొనాలనుకునే టీం 150 డాలర్లు ఫీజు చెల్లించి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ పోటీలో పాల్గొనాలనుకునే వారు https://events.tana.org/event/ohio-cricket-tournament-2025 లింకులో తమ పేర్లు నమోదు చేసుకోవచ్చు. ఈ పోటీలో (Cricket Tournament) పాల్గొనాలుకునే వారంతా దరఖాస్తు చేసుకోవాలని తానా కోరింది.