Zohran Mamdani: జోహ్రాన్ మమ్దానీ అను నేను.. న్యూయార్క్ మేయర్ గా ప్రమాణస్వీకారం..
న్యూయార్క్ మేయర్ గా జోహ్రాన్ మమ్దానీ ప్రమాణస్వీకారం చేశారు. పవిత్ర ఖురాన్ పై చేతిని ఉంచి పదవిని స్వీకరించారు. అధికారికంగా న్యూయార్క్ నగర మేయర్‌గా తన పదవీకాలాన్ని ప్రారంభించారు.2026 జనవరి 1న లోయర్ మాన్ హట్టన్ ప్రాంతంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది.
ప్రమాణ స్వీకారం సమయంలో మమ్దానీ కీలక ప్రకటన చేశారు. న్యూయార్క్ నగరాన్ని నడిపించే ప్రజలకు .. పెద్దలకే పరిమితమైన సిటీహాల్ అందుబాటులోకి తెస్తానన్నారు. న్యూయార్క్ వాసులు తనపై ఉంచిన విశ్వాసం పట్ల తాను వినయంగా ఉన్నానని.. తనపై ఉన్న బాధ్యతలు తనకు తెలుసన్నారు.”మీరు న్యూయార్కర్ అయితే, నేను మీ మేయర్‌ని” అని ఆయన మద్దతుదారులను మరియు ప్రజలను ఉద్దేశించి ప్రకటించారు.. అంతేకాదు తానెప్పుడూ ప్రజాసమస్యల పరిష్కారంపైనే ఫోకస్ పెడతానన్నారు.
“పదవీ బాధ్యతలు స్వీకరించిన కొన్ని గంటల్లోనే, మేయర్ మమ్దానీ తన ప్రభుత్వ పాలనా విధానాన్ని ప్రకటించారు. తొలిరోజు మొదటి కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు, సిటీ హాల్ ఎలా పనిచేస్తుంది.. దాన్ని ఎలా సంస్కరించాలి అనే అంశాన్ని ప్రజలకు వివరించారు.
సెప్టెంబర్ 26, 2024న లేదా ఆ తర్వాత జారీ చేయబడిన అన్ని కార్యనిర్వాహక ఉత్తర్వులను రద్దు చేశారు మమ్దానీ.ఇవి రాష్ట్రం యొక్క సమగ్రాభివృద్ధిని తుడిచిపెట్టిందని ఆరోపించారు.. సేవ, కార్యాచరణ కొనసాగింపు మరియు విలువ-ఆధారిత నాయకత్వాన్ని నిర్వహించడానికి అవసరమైనదిగా భావించే ముందస్తు ఆదేశాలను జారీ చేశారు. రెండవ కార్యనిర్వాహక ఉత్తర్వులో మమ్దానీ..పాలకవర్గాన్ని ప్రకటించారు. మొత్తంగా ఐదుగురు డిప్యూటీ మేయర్ లను ప్రకటించారు.
ఆరోగ్యం మరియు మానవ సేవల కోసం డిప్యూటీ మేయర్ గా.. డీన్ ఫులీహాన్, లీలా బోజోర్గ్, జూలియా సు, జూలియా కెర్సన్ మరియు హెలెన్ ఆర్టిగాలను ఆ పదవులకు నియమించారు. ఈ ఉత్తర్వు ద్వారా..చీఫ్ ఆఫ్ స్టాఫ్ మరియు చీఫ్ కౌన్సెల్ పదవులను కూడా అధికారికంగా ప్రకటించారు. మేయర్ కార్యాలయం కింద కీలక కార్యాలయాల నిరంతర నిర్వహణను ధృవీకరించింది.
మమ్దానీ మాటలలో, “వద్దు” అనే సంస్కృతిని “ఎలా” అనే దానితో భర్తీ చేయడంపై ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను సూచించాయి. కొత్త పరిపాలన తొలిరోజే న్యూయార్క్ వాసులు ఎదుర్కొంటున్న గృహనిర్మాణం అంశాన్ని తీసుకున్నారు మమ్దానీ. మీ అందరికీ అండగా ఉంటానంటూ మరోసారి తనదైన శైలిలో హామీ ఇచ్చారు.






