భారత్ కు అమెరికా హిట్టర్ వార్నింగ్
పొట్టి ప్రపంచ కప్ పోటీలకు ఆతిథ్యమిస్తున్న అమెరికా సూపర్-8కు అడుగు దూరంలో నిలిచింది. టైటిల్ ఫేవరెట్ టీమిండియా తో న్యూయార్క్‌లో తలపడనుంది. భారత్‌తో కీలక మ్యాచ్‌కు ముందు అమెరికా హిట్టర్ అరోన్ జోన్స్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. గతంలో తాము పెద్ద జట్లను ఓడించామని, భారత్‌కు గట్టి పోటీ ఇస్తామని జోన్స్ అన్నాడు. న్యూయార్క్‌లో మీడియా సమావేశంలో జోన్స్ మాట్లాడుతూ భారత్‌కు మేము గట్టి పోటీనిస్తాం. ప్రతి మ్యాచ్‌లో విజయమే లక్ష్యంగా పెట్టుకున్నాం. టీమిండియాపై కూడా భయం లేకుండా ఆడి టాప్‌లోకి రావాలనుకుంటున్నాం. అందుని మేము గట్టిగా శిక్షణ తీసుకుంటున్నాం. గత రెండు వారాలుగా మేమంతా జట్టుగా బాగా ఆడుతున్నాం. భారత్‌పై కూడా మేము దూకుడుగానే ఆడుతాం. గతంలో పెద్ద జట్లను మేము ఓడిరచాం అని తెలిపాడు.







