టీటీఏ ఆధ్వర్యంలో ఉత్సాహంగా ‘సమ్మర్ పిక్నిక్’.. ముహూర్తం ఫిక్స్!

ట్రై స్టేట్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ) ఆధ్వర్యంలో శనివారం నాడు సమ్మర్ పిక్నిక్ నిర్వహిస్తున్నారు. ఇలినాయిస్‌లోని ఎల్క్ గ్రూవ్ విలేజ్ వేదికగా ఉదయం 11 గంటల నుంచి ఈ కార్యక్రమం జరగనుంది. ఈ పిక్నిక్‌లో పాల్గొనాలనుకునేవారు టీటీఏ సభ్యులైతే ప్రవేశం ఉచితం. నాన్-మెంబర్స్ అయితే మాత్రం పది డాలర్ల ఎంట్రీ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ పిక్నిక్‌లో భోజనంతోపాటు ఆటలు, పాటలు, చిన్నారుల పోటీలు వంటి ఎన్నో ఉత్సాహవంతమైన కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ పిక్నిక్‌కు వెళ్లాలనుకునే వారు www.telugu.org/events/summer-picnic-2024 వెబ్‌సైటులో దరఖాస్తు చేసుకోవచ్చు.