TTA: వాషింగ్టన్లో వుమెన్స్ షెల్టర్లో ఫుడ్ డ్రైవ్ నిర్వహించిన టీటీఏ
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ) (TTA) సియాటెల్ ఛాప్టర్ ఆధ్వర్యంలో వాషింగ్టన్లోని సోఫియాస్ వే వుమెన్స్ షెల్టర్లో ఫుడ్డ్రైవర్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా కమ్యూనిటీ సేవలో తమ అంకిత భావాన్ని చూపించడంతోపాటు, అవసరంలో ఉన్న వారికి తాము ఎప్పుడూ అండగా ఉంటామని టీటీఏ మరోసారి చాటిచెప్పింది. ఈ కార్యక్రమాన్ని టీటీఏ (TTA) మాజీ అధ్యక్షులు వంశీరెడ్డి కంచరకుంట్ల, గనేష్ వీరమనేని (ఈవీపీ), ప్రదీప్ మట్టె (నేషనల్ కోఆర్డినేటర్), మనోహర్ బోడ్కే (ఎథిక్స్ కమిటీ డైరెక్టర్), ఆర్వీపీలు లవ కుమార్, శ్యామ్ సుందర్ రెడ్డి, రాజేష్ ముందుండి నడిపించారు. ఎంతో మంది యువత ఈ కార్యక్రమంలో వాలంటీర్లుగా సేవలందించారు. ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని సేవలందించిన అశ్రిత రెడ్డి కంచరకుంట్ల, వర్ణిక చిలకూరు, హేమ్ చిలకూరు, విక్రమ్ బోడ్కే, ప్రిష, శ్రేష్ఠ మెట్టు, నిష్ఠ మెట్టు అందరిని టీటీఏ ప్రత్యేకంగా అభినందించింది. ఇలాంటి కార్యక్రమాలతో సమాజంపై పాజిటివ్ ప్రభావం చూపుతూ, అవసరంలో ఉన్న వారికి తామున్నామనే భావనను టీటీఏ (TTA) కొనసాగిస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో సేవాకార్యక్రమాలు నిర్వహించేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నట్లు టీటీఏ (TTA) పేర్కొంది.







