TAJA: జాక్సన్విల్లేలో వైభవంగా ‘తాజా’ సంక్రాంతి సంబరాలు
జాక్సన్విల్లే: అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఉన్న జాక్సన్విల్లే తెలుగు సంఘం (TAJA – Telugu Association of Jacksonville Area) ఆధ్వర్యంలో ఈ ఏడాది సంక్రాంతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. 23 ఏళ్లుగా తెలుగు సంస్కృతిని కాపాడుతూ వస్తున్న ఈ సంస్థ, “తాజా సంక్రాంతి సంబరాలు-2026” పేరుతో ఈ వేడుకను ఏర్పాటు చేసింది.
కార్యక్రమ వివరాలు:
తేదీ: జనవరి 10, 2026 (శనివారం).
సమయం: సాయంత్రం 7:00 గంటల వరకు.
వేదిక: పోంటే వెడ్రా హై స్కూల్ (Ponte Vedra High School).
చిరునామా: 460 Davis Park Rd, Ponte Vedra Beach, FL 32081.
నిర్వాహక బృందం:
ఈ కార్యక్రమ విజయవంతం కోసం ఈవెంట్ డైరెక్టర్లుగా శిల్ప దామిశెట్టి, మధు రాందాస్పల్లి, దీప్తి పులగం, రాధిక గజుల, ఝాన్సీ సిరిపిరెడ్డి వ్యవహరిస్తున్నారు.
తెలుగు వారందరూ ఈ వేడుకలో పాల్గొని పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని నిర్వాహకులు కోరారు. మరింత సమాచారం కోసం eventdirectors@manataja.org అనే ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు.






