తానా కోవిడ్ సహాయం

386 ఆక్సిజన్ కాన్సన్‍ట్రేటర్లు, 50 వెంటిలేటర్లు, 20వేల మెడికల్ కిట్స్
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ బాధితులను ఆదుకోవడం కోసం ముందుకు వచ్చింది. దాదాపు 40 లక్షల రూపాయల విలువైన 20వేల మెడికల్ కిట్స్ ను, 386కు పైగా ఆక్సిజన్ కాన్సన్‍ట్రేటర్లు, 50కి పైగా వెంటిలేటర్లను తెలంగాణ, ఆంధప్రదేశ్ రాష్ట్రాల్లో పంపిణీ చేస్తోంది. కోవిడ్ ప్రత్యేక సేవల కోసం తానా ప్రత్యేకంగా ఓ వెబ్‍సైట్‍ను కూడా రూపొందించిందని కూడా చెప్పారు. www.weserve4covid.com ఈ వెబ్‍సైట్‍లో అందుబాటులో ఉన్న హాస్పిటల్స్ బెడ్స్ వివరాలు, అంబులెన్స్ సౌకర్యం వివరాలు, మెడికల్, వెంటిలేటర్స్ వివరాలు ఇందులో ఏర్పాటు చేశారు. అంతిమ సంస్కారాల కోసం అంబులెన్స్ లను కూడా తానా అందించింది. రాజా తాళ్ళూరి, జయ తాళ్ళూరి కలిసి 60 వెంటిలేటర్లను కొనుగోలు చేసి ఇండియాకు పంపించారు. మరికొన్నిచోట్ల ఆక్సిమీటర్లు, నిత్యావసర సరకులను కూడా కొన్ని ప్రాంతాల్లో తానా పంపిణీ చేసింది. 6 చోట్ల తానా పేరు మీద కోవిడ్ ఐసొలేషన్ సెంటర్లు ఏర్పాటు చేశారు.
కాన్సన్‍ట్రేటర్లను శిరీష తూనుగుంట్ల, సురేష్ కాకర్ల, చందు గొర్రెపాటి, శ్రీనిలావు, మదుమారెడు, వినోజ్ చనుమోలు, హరీష్ కొలసాని, శశికాంత్ వల్లేపల్లి, సురేష్ పుట్టగుంట, మెడికల్ కిట్స్ ను సుమంత్ రామ్‍సెట్టి, రాజా కసుకుర్తి, సురేష్ కాకర్ల, శిరీష తూనుగుంట్ల, శశికాంత్ వల్లేపల్లి, సురేష్ మిట్టపల్లి, రెడ్ క్రాస్ చైర్మన్ శ్రీధర్ రెడ్డి, వెంటిలేటర్ లను జయ్ తాళ్ళూరి, శిరీష తూనుగుంట్ల, హరీష్ కొలసాని, నిరంజన్ శృంగవరపు, శశికాంత్ వల్లేపల్లి, సతీష్ వేమూరి కో అర్డినేట్ చేశారు.
తానా కోవిడ్ సేవల్లో భాగంగా ఏప్రిల్ నుంచి మే చివరి నాటి వరకు దాదాపు 4.5కోట్ల రూపాయల సహాయాన్ని తెలుగు రాష్ట్రాలకు అందించినట్లు తానా అధ్యక్షుడు జయ్ తాళ్ళూరి తెలిపారు. ఆంధప్రదేశ్ కోసం తానా పంపించిన వంద ఆక్సిజన్ కాన్సన్‍ట్రేటర్ లను రెడ్‍క్రాస్ సొసైటీ ఏపీ శాఖకు రాష్ట్ర కోవిడ్ నోడల్ అధికారి అర్జా శ్రీకాంత్ అందజేశారు. కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో రెడ్‍క్రాస్ పిలుపుతో తానా సభ్యులు ప్రతి జిల్లాకూ అంబులెన్స్ ఇచ్చేందుకు ముందుకు రావడం భేష్ అన్నారు.
రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ ఎ.శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఆక్సిజన్ కాన్సన్‍ట్రేటర్లు అందించడం అభినందనీయమని, ఇవి అవసరమైనవారు 18004251234కి ఫోన్ చేయాలని సూచించారు. రాష్ట్ర రెడ్ క్రాస్ కార్యదర్శి ఎ.కె. ఫరీడా, ఏపీ స్టేట్ ప్లానింగ్ సొసైటీ డైరెక్టర్ కె.శివశంకర్ తదితరులు కూడా తానా కోవిడ్ సేవలను అభినందించారు.