బే ఏరియాలో ఎస్‌పిబి 50 సక్సెస్

బే ఏరియా తెలుగు అసోసియేషన్ (బాటా), పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, ఐ బ్రిడ్జ్ ఇంక్ ఆధ్వర్యంలో జరిగిన ఎస్‌పిబి 50 మ్యూజికల్ వరల్డ్ టూర్ కార్యక్రమం సూపర్ హిట్టయింది. కాల్ హోమ్స్ – రమణా రెడ్డి గ్రాండ్ స్పాన్సర్‌గా, గూగైన్, రవి ట్యాక్స్ సర్వీసెస్ ముఖ్యమైన స్పాన్సర్‌గా వ్యవహరించారు. షాలిమార్, ఇండియన్ కుజిన్ (ఫుడ్ స్పాన్సర్స్), త్రినేత్ర ఇండియన్ మార్కెట్ (గోల్డ్ స్పాన్సర్), చిమట మ్యూజిక్. కమ్, విరిజల్లు, కెఎల్‌ఓకె 1170 ఎఎం, బాలీ 92.3 ఎఫ్‌ఎం, తెలుగు టైమ్స్, యు ఎన్ మి ఎంటర్‌టైన్‌మెంట్స్ మీడియా స్పాన్సర్లుగా ఉన్నాయి.
కార్యక్రమంలో భాగంగా తొలుత మ్యూజిక్ సిబ్బందిని అందరికీ పరిచయం చేశారు. చిన్న, ప్రవీణ్ (కీ బోర్డ్), రవిశంకర్ (ఫ్లూట్), స్వామి (రిథం ప్యాడ్స్), కాలెబ్ (బాస్ గిటార్), వేణు (తబలా), అరుణ్ (డ్రమ్స్), సురేష్ (తబలా), నవీన్ (కీ బోర్డ్), మంగైరాజ్ (లీడ్ గిటార్), గాయనీ గాయకులు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర, ఎస్.పి. శైలజ, ఎస్.పి. చరణ్‌తోపాటు నూతన గాయకులు సాయి చరణ్, ఎస్.పి. అభిషేక్, స్వాగత, లత ఈ కార్యక్రమంలో పాటలను పాడారు. ఎస్.పి. చరణ్ ఈ కార్యక్రమం ఏర్పాటు వెనుక ఉన్న ఉద్దేశ్యాలను వివరించారు.
బాటా అడ్వయిజర్ విజయ ఆసూరి తొలుత ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యంను వేదికపైకి ఆహ్వానించి బాటా తరపున ఈ కార్యక్రమం నిర్వహించుకునేందుకు అవకాశం?ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పారు. ఎస్‌పిబి మాట్లాడుతూ, తాను ఎదిగేందుకు అవకాశం ఇచ్చిన ఎస్.పి. కోదండపాణిని స్మరించుకుంటూ కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేసినందుకు బాటాను, స్పాన్సర్లను అభినందించారు. ఈ సందర్భంగా హిట్టయిన నాటి నేటి పాటలను పాడారు.
ఓ చిన్నదాన, ఏ దివిలో విరిసిన పారిజాతమో, శంకరాభరణం సినిమా పాటలను పాడారు. ఆకాశం నీ హద్దురా, ఓ బంగారు రంగుల చిలక, ఓంకారనాదాను, జై జై గణేశా, మామా చందమామా, వంటి పాటలతో అందరినీ ఎస్‌పిబి టీమ్ అలరించింది.
ఈ కార్యక్రమం సందర్భంగా స్పెషల్ సింగింగ్ పోటీలను నిర్వహించారు. సబ్ జూనియర్స్‌లో అద్విక్ సెక్కప్పన్ విజేతగా నిలిచారు. హస్సిని భట్టిప్రోలు రన్నర్‌గా నిలిచింది. జూనియర్స్ విభాగంలో సంజన తొడుపునూరి విజేతగా, అమృత తుర్లపాటి రన్నర్, మేథా అనంతుని రన్నర్‌గా, టీన్స్ విభాగంలో మానస గాదేపల్లి విజేతగా, మాధవ్ దంతుర్తి, శ్రీచందన అనుమోలు రన్నర్‌గా, పెద్దల విభాగంలో పద్మజ శ్వేత భమిడిపాటి విన్నర్‌గా, అన్వేష్ కొమురవెల్లి రన్నర్‌గా నిలిచారు.
బాటా ఎగ్జిక్యూటివ్ టీమ్ శిరీష బత్తుల (ప్రెసిడెంట్), యశ్వంత్ కుదరవల్లి (వైస్ ప్రెసిడెంట్), సుమంత్ పుసులూరి (సెక్రటరీ), హరినాథ్ చికోటి (ట్రెజరర్), శ్రీకర్ బొడ్డు (జాయింట్ సెక్రటరీ), కల్చరల్ కమిటీ సభ్యులు శ్రీదేవి పసుపులేటి, శ్రీలు వెలిగేటి, దీప్తి సత్తి, లాజిస్టిక్ కమిటీ కొండల్ కొమరగిరి, అరుణ్ రెడ్డి, ప్రశాంత్ చింత, నరేష్ గాజుల, స్టీరింగ్ కమిటీ సభ్యులు రవి తిరువీధుల, కామేష్ మల్ల, కళ్యాణ్ కట్టమూరి, అడ్వయిజరీ బోర్డ్ సభ్యులు జయరామ్ కోమటి, విజయ ఆసూరి, వీరు ఉప్పల, ప్రసాద్ మంగిన, రమేష్ కొండ, కరుణ్ వెలిగేటి తదితరులు వేడుకలను విజయవంతం చేసినవారందరికీ ధన్యవాదాలు చెప్పారు. పీపుల్ మీడియాకు చెందిన విశ్వ ప్రసాద్ కూడా బే ఏరియా అభిమానులకు, ఇతరులకు ధన్యవాదాలు తెలియజేశారు.