రద్దయిన నాటా మెగాకన్వెన్షన్ 2021

న్యూజెర్సిలోని అట్లాంటిక్ సిటీలో నవంబర్ 25 నుంచి 27వరకు జరగనున్న నాటా మెగా కన్వెన్షన్‌ను రద్దు చేసినట్లు నాటా అధ్యక్షుడు రాఘవరెడ్డి గోసల తెలిపారు. అమెరికా ప్రభుత్వం వీసాల విషయంలో తీసుకున్న నిర్ణయం వల్ల ఇండియా నుంచి ప్రముఖులు, సంగీత కళాకారులు రాలేని నేపథ్యంలో ఈ కన్వెన్షన్‌ను రద్దు చేయాలని నిర్ణయించినట్లు ఆయన వివరించారు. ఇతర అంశాలపై త్వరలోనే తాము నిర్ణయం తీసుకుంటామని కూడా ఆయన తెలిపారు.