Bay Area: జయరామ్‌కు పదవి… బే ఏరియాలో సంబరాలు
అమెరికా కమ్యూనిటీకి ఎల్లప్పుడు చేదోడువాదోడుగా ఉంటూ, ఎన్నారై టీడిపి నాయకునిగా, అమెరికాలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి విశేషంగా కృషి చేసిన తెలుగు కమ్యూనిటీ ప్రముఖులు జయరాం కోమటిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర అమెరికాలో ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమించింది. ఆయనకు ఈ పదవి లభించడం ఇది రెండోసారి.
బే ఏరియాలో స్వాగత్ రెస్టారెంట్ గ్రూపు అధినేతగా, తానా, ఎఫ్ ఐఎ వంటి సంఘాల నాయకునిగా, ఎన్నారై టీడీపి కో ఆర్డినేటర్ గా జయరామ్ కోమటి అందరికీ చిరపరిచితులే. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అమెరికాకు వచ్చే రాజకీయ నాయకులు, సినిమా సెలబ్రిటీలు అందరూ జయరామ్ కోమటి స్వాగత్ ఆతిధ్యం స్వీకరించకుండా వెళ్ళరు. ఎన్నో సంస్థలకు, దేవాలయాలకు, శంకర్ నేత్రాలయకు, ఇతర వైద్య సంస్థలకు ఆయన పెద్దమొత్తంలో విరాళాలను అందించారు. పేద విద్యార్థుల చదువుకు సహాయం అందించేవారు. బే ఏరియాలో ఎవరికి ఏ ఆపదవచ్చినా సహాయం అందించేందుకు ముందుండేవ్యక్తిగా జయరామ్ కోమటిని పేర్కొనేవారు. ఇప్పుడు జయరామ్ కోమటికి ప్రభుత్వ పదవి లభించడం పట్ల పలువురు ఎన్నారైలు హర్షం వ్యక్తం చేశారు.
బే ఏరియాలోని ఎన్నారై టిడిపి నాయకులు వెంకట్ కోగంటి ఆధ్వర్యంలో సమావేశమై జయరామ్ కోమటికి పదవి లభించడంపై ఆనందం వ్యక్తంచేస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పిల్లలచేత కేక్ ను కట్ చేయించారు. జయరాం కోమటి రాష్ట్రానికి, అమెరికా కమ్యూనిటికి చేసిన సేవలను ఈ సందర్భంగా పలువురు గుర్తు చేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో వెంకట్ కోగంటితోపాటు హరి సన్నిధి, శ్రీనివాస్ తాడపనేని, విజయ్ గుమ్మడి, విజయ్ సాగర్ రెడ్డి జెట్టి, కృష్ణ మట్టపర్తి, రమేష్ మల్లరపు, రామ్ తోట, శ్రీనివాస్ వల్లూరపల్లి, తిరుమలపుత్ర చంద్రశేఖర్, రవికిరణ్ ఆలేటి, శ్రీకాంత్ కూర్మన, లోకేష్ మార్పూరు, శ్రీనివాస్ వట్టికూటి, జగ్ గింజుమల్లి, తిరుపతిరావు వలివేటి, నరేంద్రరెడ్డి కోన, మహేంద్ర కూచిపూడి, రాంబాబు ఉప్పుటూరి, అనిల్ రెడ్డి, సందీప్ నక్క, సుధీర్ సి, సుధాకర్ కె, రాజశేఖర్ హెచ్, కిషోర్ తాడికొండ, మోహన్ మల్లంపాటి, రాజుగారు, డేవిడ్ బానోతు, కిరణ్ కూసుపూడి పాల్గొన్నారు.






