GCIC: చికాగోలో ఘనంగా గ్రేటర్ చికాగో ఇండియన్ కమిటీ 10వ వార్షికోత్సవం..
నేపర్విల్: అమెరికాలోని చికాగో పరిసర ప్రాంత ప్రవాస భారతీయుల కోసం గ్రేటర్ చికాగో ఇండియన్ కమిటీ (GCIC) ఒక భారీ వేడుకను సిద్ధం చేసింది. సంస్థ స్థాపించి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా “పొంగల్, మకర సంక్రాంతి, గణతంత్ర దినోత్సవ వేడుకల”ను జనవరి 17, 2026 శనివారం నాడు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.
వైవిధ్యభరితమైన సాంస్కృతిక కార్యక్రమాలు
జనవరి 17 మధ్యాహ్నం 2:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు నేపర్విల్లోని ‘యల్లో బాక్స్’ వేదికగా చిన్నారులు, పెద్దల కోసం పలు పోటీలు నిర్వహించనున్నారు:
చిన్నారుల కోసం ఫ్యాషన్ షో, డ్రాయింగ్ పోటీలు, అగ్ని రహిత వంట (No Fire Cooking) పోటీలు.
పెద్దల కోసం వంటల పోటీ, రంగోలి పోటీలు.
వీటితో పాటు అద్భుతమైన సాంస్కృతిక ప్రదర్శనలు, ప్రత్యేక విందు (Special Dinner) ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి సాహిత్య వింజమూరి వ్యాఖ్యాతగా (Emcee) వ్యవహరించనున్నారు.
అలరించనున్న అనూప్ రూబెన్స్ మ్యూజికల్ కాన్సర్ట్
ఈ వేడుకలో భాగంగా అదే రోజు సాయంత్రం 6:00 గంటల నుండి టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ కచేరీలో అనూప్‌తో పాటు ప్రముఖ గాయనీ గాయకులు గోవింద్, హనుమాన్, సృష్టి చల్లా, మనోజ్ఞ, ప్రణవి ఆచార్య తమ పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించనున్నారు.
టిక్కెట్లు, సంప్రదింపులు
GCIC సభ్యులకు ప్రవేశం ఉచితం కాగా, సభ్యులు కాని వారికి 20 డాలర్లుగా నిర్ణయించారు. జనవరి 8 లోపు బుక్ చేసుకునే వారికి ఎర్లీ బర్డ్ డిస్కౌంట్లు కలవు. అయితే అనూప్ రూబెన్స్ సంగీత విభావరికి విడిగా టిక్కెట్లు తీసుకోవాల్సి ఉంటుంది.
వేదిక: Yellow Box, 1635 Emerson Ln, Naperville, IL 60540.
సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: చందన (+1 708 518-6801), చరణశ్రీ (+1 630 489-8092), స్వప్న (6308881635) లేదా శివ అరిగె (9205629719).
చికాగోలోని తెలుగు వారందరూ ఈ వేడుకకు హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు.






