NATS: నాట్స్ చైర్మన్గా కిషోర్ కంచర్ల నియామకం..
టెక్సాస్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS) నూతన చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన కిషోర్ కంచర్ల గారికి ప్రవాస తెలుగు సమాజం నుండి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగు కమ్యూనిటీ పట్ల ఆయనకు ఉన్న అంకితభావం, నిరంతర సేవ, నాయకత్వ పటిమకు గుర్తింపుగా ఈ గౌరవం దక్కిందని పలువురు కొనియాడారు. కిషోర్ కంచర్ల గారు నాట్స్ చైర్మన్గా ఎన్నికైన సందర్భంగా ‘బావర్చి టీమ్’ (Team Bawarchi) ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసింది. తెలుగు వారి సంక్షేమం కోసం ఆయన మరిన్ని గొప్ప కార్యక్రమాలు చేపట్టాలని, ఆయన పదవీ కాలం విజయవంతంగా సాగాలని వారు ఆకాంక్షించారు.






