Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » Usacitiesnews » Newjersey » Mata bonala jatara celebrations in new jersey

ఘనంగా బోనాల జాతర….అమెరికాలో పోతురాజుల సందడి

  • Published By: techteam
  • August 2, 2024 / 05:56 PM IST
  • Facebook
  • twitter
  • whatsapp
Mata Bonala Jatara Celebrations In New Jersey

తెలంగాణ సంస్కృతీ, ఆచార సంప్రదాయాలకు అద్దంపట్టే పండుగ బోనాల జాతరను అగ్రరాజ్యం అమెరికాలోనూ ప్రవాసీయులు అబ్భురపరిచే రీతిలో నిర్వహించుకున్నారు. 

Telugu Times Custom Ads

మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణాలో ప్రత్యేకంగా అమ్మవారిని పూజించి బోనం సమర్పించే ఈ వేడుకను ఘనంగా జరుపుకున్నారు ప్రవాసులు. హైదరాబాద్ లాల్ దర్వాజ లష్కర్ బోనాలను మరిపించే విధంగా, న్యూజెర్సీ రాష్ట్రంలోని ఎడిసన్లో సాయిదత్తపీఠం శ్రీ శివ విష్ణు దేవాలయంలో బోనాలప్రదర్శన, పోతురాజుల నృత్యాలతో అట్టహాసంగా నిర్వహించారు మాట సభ్యులు.

అమెరికాలో తెలుగు ఆడపడుచులు బోనమెత్తారు.ఈ కార్యక్రమంలో తెలుగు ప్రవాసులు సంప్రదాయ వస్త్రధారణలో భారీ సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా దేవాలయ నిర్వాహకులు ,మాటా వారి సహకారంతో   మహిళలు అందరూ  అమ్మవారికి పూజలు చేసి బోనం సమర్పించుకున్నారు . తెలంగాణ – అమెరికా ప్రజలు సుఖశాంతులతో జీవించాలని ప్రార్థించారు. ఆషాడ మాసం చివరి వారం సందర్భంగా నిర్వహించే మహంకాళీ బోనాలను డప్పు చప్పుళ్లతో  , తొట్టెలను ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. 

ఊరేగింపులో భాగంగా.. చిన్నాపెద్దా అంతా అమ్మవారి పాటలకు  నృత్యాలు చేస్తూ మైమరిచిపోయారు. ఈ వేడుకల్లో పోతురాజులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. లోకల్ టాలెంటును ఎప్పుడూ ప్రోత్సహించే మాట టీం ఈ సారి కూడా పోతురాజుల విషయంలోనూ లోకల్గా ఉండే వేణు గిరి, అశోక్ చింతకుంటను పోతురాజు లాగా ఎంకరేజ్ చేసి అమెరికాలోను పోతురాజులు ఉన్నారు అనేలా చేశారు. 

ఈ సందర్భంగా MATA అధ్యక్షులు శ్రీనివాస గనగోని అందరికి బోనాల శుభాకాంక్షలు తెలిపారు. అమెరికాలో రెండొవసారి  బోనాలు చేయడం, వందల సంఖ్యలో మహిళలు పాల్గొనడం, ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతృప్తిని కలిగించిందన్నారు. ఆ అమ్మవారి శక్తి తోడయి మాటా వైవిధ్యమయిన, అందరికి ఉపయోగకరమైన సేవ కార్యక్రమాలతో మరింత సేవ చేసే ఆవకాశం కలగాలని, ఆ శక్తి ని ప్రసాదించాలని కోరుకుంటున్నానని చెప్పారు.

సాయిదత్తపీఠం నిర్వాహకులు శ్రీ రఘుశర్మశంకర మంచి కూడా మహిళలు అందరికి శుభాకాంక్షలు తెలియచేయడంతో పాటు అమ్మవారిని స్వాగతించే  పూజ కార్యక్రమం నుంచి  బోనం సమర్పించడం వరకు ప్రతి కార్యక్రమాన్ని తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా జరిపించారు. 

ఈ వేడుకల్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిరణ్ దుద్దగి, సెక్రెటరీ ప్రవీణ్ గూడురు, ఎగ్జికూటివ్ కమిటీ సభ్యులు స్వాతి అట్లూరి, శ్రీధర్ గూడాల, బోర్డు అఫ్ డైరెక్టర్ కృష్ణ శ్రీ గంధం, మాటా కార్యవర్గం, కృష్ణ సిద్ధాడ,శిరీష గుండపునేని ఆధ్వర్యంలో, వెంకీ మస్తీ, కళ్యాణీ బెల్లంకొండ, పూర్ణ భేడిపూడి, మల్లిక్ రెడ్డి సహాకారంతో ఈ  కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. స్టాండింగ్ కమిటి మెంబెర్స్ మరియు రీజినల్ కో ఆర్డినేటర్స్ తో పాటు గిరిజ మదాసి అలంకరణ చేసేందుకు సహాయం చేశారు. మరోవైపు.. మాధురి, ప్రసూన, నీలిమ, శిల్పతో పాటు పలువురు సభ్యులు ఈ బోనాల ఏర్పాట్లలో సహకరించారు.సాయిదత్త పీఠం నుంచి పూర్ణిమ,రంజిత ఈ సంబురాల్లో తమ వంతు పాత్ర పోషించారు. అందరూ కలిసి.. అమెరికాలో ఉన్న తెలుగు వారికి తమ పండుగను కళ్ల ముందుకు తీసుకురావటానికి ఎంతో కష్టపడ్డారు.

కాగా.. మాటా పిలుపు మేరకు..అమెరికా వ్యాప్తంగా స్థిరపడిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన తెలుగు కుటుంబాలు పెద్ద సంఖ్యంలో ఈ బోనాల జాతరలో పాల్గొని వేడుకను విజయవంతం చేశారు. జాతరలో పాల్గొని వేడుకను విజయవంతం చేసిన తెలుగువారందరికీ మాటా నిర్వహాకులు ధన్యవాదాలు తెలిపారు.

 

Click here for Photogallery

 

 

 

Tags
  • Bonala Jatara
  • Celebrations
  • MATA
  • New Jersey

Related News

  • Trump Administration Plans Significant H 1b Visa Changes

    H1B Visa: హెచ్1బీ వీసాలపై యూఎస్ ఫోకస్.. అమెరికన్లకు అన్యాయం జరిగితే ఊరుకోం!

  • Sai Mandir Ganesh Worship In Baltimore City Usa

    Ganesh Chaturthi: అమెరికాలో ఎలికాట్‌లోని సాయి మందిర్‌లో ఘనంగా గణేష్ పూజలు

  • Ap Youth Dies After Drowning In Swimming Pool In Boston

    Boston: బోస్టన్‌లో స్విమ్మింగ్ పూల్‌లో మునిగి ఏపీ యువకుడు మృతి

  • Vishwarshi Vasili Inter International Literature Conference

    Literature Seminar: విశ్వర్షి వాసిలి – అంతర్జీతీయ సాహితీ సదస్సు

  • Mind Delights A Spiritual Satsang Organized By Ata

    ATA: ఆటా నిర్వహించిన స్పిరిచువల్ సత్సంగ్ విజయవంతం

  • Ganesh Festival Celebrations In Bay Area

    Bay Area: కాలిఫోర్నియాలో 20 వేల మందితో గణేష్ చతుర్థి ఊరేగింపు

Latest News
  • Medical Colleges: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ.. ప్రభుత్వం తప్పు చేస్తోందా?
  • Mithun Reddy: ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్..
  • Ganesh Nimajjanam: నిమజ్జన ప్రక్రియను ఆకస్మికంగా పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
  • Khairatabad Ganesh:గంగమ్మ ఒడికి బడా గణేశ్‌ …ఘనంగా ఖైరతాబాద్‌ వినాయకుడి నిమజ్జనం
  • Modi: అమెరికాతో భాగస్వామ్యానికి మోదీ ప్రాముఖ్యత
  • Yadagirigutta: యాదగిరిగుట్ట ఆలయం లో దర్శనాలు నిలిపివేత
  • Nara Lokesh: చంద్రబాబు, వైఎస్సార్ ప్రభావం..లోకేష్, జగన్‌ల భిన్న శైలి..
  • Chandrababu: కేబినెట్‌ చేర్పులపై చంద్రబాబు క్లారిటీ..నేతలకు తప్పని వెయిటింగ్..
  • PM Modi :ఐరాస సమావేశానికి మోదీ దూరం!
  • Harish Rao: నాపై ఆరోపణలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నా : హరీశ్‌రావు
  • instagram

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer