Jayaram Komati: జయరామ్ కోమటికి ‘కళారత్న’ పురస్కారం
అమెరికాలో తెలుగు కమ్యూనిటికీ విశేషంగా సేవలందిస్తున్న తెలుగు కమ్యూనిటీ ప్రముఖులు శ్రీ జయరామ్ కోమటి (Jayaram Komati) కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘కళారత్న’ పురస్కారాన్ని ప్రకటించింది. సంఘసేవకు ఆయన చేసిన కృషికిగాను ఆయనకు ఈ పురస్కారాన్ని అందజేస్తున్నారు.
తెలుగుటైమ్స్ పత్రిక ఫౌండర్‌గా, తానా మాజీ అధ్యక్షునిగా జయరామ్ కోమటి అటు అమెరికాలోనూ, ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నో సేవలందించారు. ఎంతోమందికి సహాయం చేశారు. ఆయనకు ఈ పురస్కారం లభించడం పట్ల పలువురు సంతోషాన్ని వ్యక్తం చేశారు.







