రోజుకు 2 లక్షల కేసులు
అమెరికాపై విరుచుకుపడుతున్న కరోనా మహమ్మారి రానున్న రోజుల్లో మరింత ఉద్ధ•తిని కొనసాగించనున్నదా? తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ అంతర్గత నివేదిక ఇదే విషయాన్ని సృష్టం చేస్తున్నది. జూన్ 1 నాటికి అమెరికాలో రోజుకు 2 లక్షల మందికి చొప్పున వైరస్ సోకుతుందని, 3 వేల మంది చొప్పున మరణిస్తారని నివేదిక వెల్లడించింది. ఒకవైపు దేశంలో కరోనా సంక్షోభం కొనసాగుతున్నప్పటికీ 20కి పైగా రాష్ట్రాలు ఆర్థిక వ్యవస్థల్ని తెలిచాయని పేర్కొంది. జాన్స్ హాప్కిన్స్ బ్లూమ్‌బర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లోని ఎపిడమాలజీ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న జస్టిస్ లెస్లర్ అంచనాలతో ఈ నివేదిక రూపొందించినట్టు వెల్లడించింది.






