అమెరికాలో భారత సంతతి వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్ష
ఉబర్ యాప్ ఉపయోగించి 800 మంది భారతీయులను కెనడా నుంచి అమెరికా అక్రమంగా తరలించిన కేసులో భారత సంతతికి చెందిన వ్యక్తికి యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు మూడేళ్ల జైలు శిక్షను విధించింది. కాలిఫోర్నియాకు చెందిన రాజేందర్ పాల్ సింగ్ అలియాస్ జస్పాల్ గిల్ స్మగ్లింగ్ రింగ్‌లో కీలక సభ్యుడిగా వ్యవహరించాడు. 2028 నుంచి 2022 వరకు సాగిన ఈ స్మగ్లింగుకు గాను 5 లక్షల యూఎస్ డాలర్లు పొందినట్లు గిల్ అంగీకరించాడు. అక్రమ తరలింపునకు ఉబర్ యాప్‌ను ఉపయోగించినట్లు నిందితుడు తెలిపాడు. అమెరికా చట్టాల ప్రకారం మూడేళ్ల జైలుశిక్ష అనంతరం గిల్‌కు దేశ బహిష్కరణ విధించే అవకావం ఉందని కోర్టు వర్గాలు చెబుతున్నాయి.






