మలేషియా లోని కౌలాలంపూర్ సిటీ సెంటర్ లో బతుకమ్మ ఆట పాటలు
75వ భారత గణతంత్ర దినోత్సవం లో భాగంగా హై కమిషనర్ అఫ్ ఇండియా శ్రీ బి.న్ రెడ్డి గారు కౌలాలంపూర్ సిటీ సెంటర్ లో విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా మలేషియా ఫైనాన్స్ మినిస్టర్ దాతుశ్రీ అమిర్ హాంజా, డిప్యూటీ మినిస్టర్ అఫ్ యూనిటీ సరస్వతి కందస్వామి, కుల సేకరేన్ డిప్యూటీ మినిస్టర్ ఇన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్,ఫెడరల్ మాజీ డిప్యూటీ మినిస్టర్ దాతో లోగ బాల మోహన్ మరియు ఇతర సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇందులో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల కు సంబంధించిన పండుగల విశిష్టతను వివరిస్తూ అలాగే తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ ఆట పాటలు ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.







