Chandrababu: ఎఎఎ కన్వెన్షన్ పోస్టర్ ఆవిష్కరించిన చంద్రబాబు
 
                                    పెన్సిల్వేనియాలోని ది గ్రేటర్ ఫిలడెల్ఫియా ఎక్స్ పో సెంటర్ లో ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA) మొట్టమొదటి జాతీయ కన్వెన్షన్ వచ్చే 2025 మార్చి 28, 29 తేదీలలో పెద్దఎత్తున నిర్వహించనున్న సంగతి అందరికీ విదితమే. ఇప్పటికే అమెరికాలోని పలు రాష్ట్రాల్లో వేగంగా చాఫ్టర్స్ ఏర్పాటు చేసి, ఆంధ్రప్రదేశ్ సంస్కృతీ సంప్రదాయాలే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్, సంస్థ తన మొట్టమొదటి జాతీయ కన్వెన్షన్‌కి వడివడిగా ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu) చేతుల మీదుగా కన్వెన్షన్ పోస్టర్ ను ఆంధ్రప్రదేశ్‌లో ఘనంగా విడుదల చేశారు. ఈ పోస్టర్లో కన్వెన్షన్ వివరాలు, హైలైట్స్ మరియు సంఘం నాయకులు హరి మోటుపల్లి, బాలాజీ వీర్నాల, హరిబాబు తూబాటి, శివకృష్ణ మందలపు ఫొటోలు ఉన్నాయి. కన్వెన్షన్ పోస్టర్ లాంచ్ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడుకు సంస్థ ఫౌండర్ హరి మోటుపల్లి, సంస్థ విధివిధానాలు, మోటివేషన్, వివిధ పోటీలు, ప్రైజ్ మనీ వంటి విషయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు కన్వెన్షన్ కి శుభాకాంక్షలు తెలపడం విశేషం. అలాగే ఆంధ్రప్రదేశ్ విద్యార్థినీవిద్యార్థులకు సహాయసహకారాలు అందించాల్సిందిగా కోరారు.
మరోవైపు ఎఎఎ నాయకులు కన్వెన్షన్ ప్రమోషన్స్ షురూ చేశారు. ముగ్గులు, మ్యూజిక్, షార్ట్ ఫిల్మ్స్, రీల్స్ వంటి పలు పోటీలు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్లు ప్రపంచంలోని తెలుగు వారందరూ ఎక్కడున్నా సరే పాల్గొనేలా, పైగా లక్షల రూపాయల (మొత్తంగా సుమారు కోటిన్నర) బహుమతులతో అందరి ఆసక్తిని ఎఎఎ కన్వెన్షన్ వైపు చూసేలా ప్రచారం చేస్తున్నారు.











