టిటిఎ కన్వెన్షన్ కు ప్రముఖుల రాక.. న్యూజెర్సికి వచ్చిన యాంకర్ సుమ, యాంకర్ రవి

తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యూజెర్సిలో మే 27 నుంచి 29వ తేదీ వరకు నిర్వహించనున్న మెగా కన్వెన్షన్ కోసం పలువురు ప్రముఖులు ఇప్పటికే న్యూజెర్సి చేరుకున్నారు. తొలుత యాంకర్ సుమ, యాంకర్ రవి న్యూజెర్సికి వచ్చినప్పుడు వారికి టీటిఎ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు.