అమెరికా వీసా.. 5 నిమిషాల్లో 10 వేల స్లాట్లు ఖతం
అమెరికా స్టూడెంట్ వీసాకు ఆదివారం అర్థరాత్రి దాటాక స్లాట్లను విడుదల చేయగా కేవలం 5 నిమిషాల్లోనే 10 వేల స్లాట్లు బుక్కయిపోయాయి. సోమవారం నుంచి ఇంటర్వ్యూలు ప్రారంభమయ్యాయి. కానీ వేల మంది విద్యార్థులకు వీసా ఫీజు (రూ.15,530) చెల్లించినా దరఖాస్తులు పూర్తవ్వలేదు. సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయేమోనని విద్యార్థులు పదే పదే ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. కొందరికైతే లిమిట్ రీచ్డ్ అనే సందేశం రావడం, మరికొందరు ఫీజు చెల్లించాక లాక్డ్ కేటగిరిలో చూపడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. అమెరికాలోని అధికారులకు మెయిల్ పెట్టి ఎంతో కష్టపడి అన్ లాక్ చేయించుకున్నా, తిరిగి లాక్డ్ కేటగిరీకి వెళ్తోందని వాపోతున్నారు.







