మెగా మేనల్లుడు మాస్ మూవీ

కేరాఫ్ మెగా ఫ్యామిలీగా ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టిన వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా సైలెంట్ గా సింపుల్ గా ఉప్పెన మూవీలాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ సినిమా బాక్స్ ఫీస్ దగ్గర మంచి కల్లెక్షన్స్ వసూలు చేయగా ఈ హీరో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. కానీ ఆ స్టార్ డమ్ ని తరువాత కంటిన్యూ చేయలేకపోయాడు వైష్ణవ్. ఉప్పెన లాంటి హిట్ లవ్ స్టోరీ తరువాత వైష్ణవ్ చేసిన మూవీ కొండపొలం.ఈ మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీలోనే విడుదలైంది. ఈ మూవీ కొంచెం పరవాలేదు అనిపించింది. ఈ సినిమా తరువాత రంగ రంగ వైభవంగా అనే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఈ మూవీ కూడా అంచనాలని మార్చేసింది. దీనితో ఈ సారి
వైష్ణవ్ ‘ఆదికేశవ’ మూవీతో ఎలాగైనా హిట్ సంపాదించాలని గట్టిగా సిద్దమయ్యాడు. వైష్ణవ్ తేజ్ ఇప్పటి వరకు నటించిన సినిమాల్లో తనని రొమాంటిక్ గాను, స్టైలిష్ లుక్స్ లోనే చూసారు. మొదటి సారి ‘ఆదికేశవ’ మూవీతో తన మాస్ లుక్స్ ని ప్రేక్షకులకు అందిస్తున్నారు చిత్ర బృందం. మొదట్లో ఈ మూవీ ఆగస్టులో రిలీజ్ అనుకొన్నారు కానీ సూపర్ స్టార్ రజినీకాంత్ ‘జైలర్’ ,మెగాస్టార్ ‘భోళా శంకర్’ మూవీస్ కోసం కావచ్చు వాయిదా వేసి ఫైనల్ గా నవంబర్ 10 న రిలీజ్ చేస్తున్నారని టీమ్ ప్రకటించింది.
తాజాగా మూవీ యూనిట్ రిలీజ్ డేట్ ని కన్ఫర్మ్ చేస్తూ ఒక పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ లో వైష్ణవ్ తేజ్, శ్రీలీల చాలా రొమాంటిక్ గా కనిపిస్తున్నారు. ఈ మూవీ లో శ్రీలీల తో పాటు అపర్ణదాస్ అనే మరో హీరోయిన్ కూడా నటిస్తుంది. దీనికి సంగీతం జీవీ ప్రకాష్ కుమార్ మరియు సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ , సాయి సౌజన్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఆదికేశవ సినిమాతో తొలిసారిగా వైష్ణవ్ మాస్ మసాల మూవీలో నటిస్తున్నాడని చెప్పొచ్చు. మరీ ఈ మూవీ అయినా వైష్ణవ్ కి కలిసొస్తుందో లేదో చూడాలి.