కైకాల సత్యానారాయణ కు సంతాపం వ్యక్తం చేస్తున్న టాలీవుడ్ సెలబ్రిటీలు

తెలుగు ఇండస్ట్రీలో సీనియర్ నటులు.. లెజెండరీ యాక్టర్ ఎస్వీ రంగారావు తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆ స్థాయి నటన కనబరిచిన కైకాల సత్యానారాయణ ఈ రోజు ఉదయం కన్నమూశారు. 60 ఏళ్ల సినీ జీవితంలో ఎన్నో మరపురాని పాత్రలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన సీనియర్ నటులు కైకాల సత్యానారాయణ కన్నమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఈ రోజు తెల్లవారుజామున ఆస్పత్రిలోనే తుదిశ్వాస విడిచారు. 1959లో సినీరంగ ప్రవేశం చేసిన నటుడు సత్యానారాయణ.. కృష్ణా జిల్లా, కౌతవరం మండలంలోని గుడ్ల వల్లేరు ఆయన స్వస్థలం ఆయనిది. ఆరు దశాబ్దాల సినీ కెరీర్‌లో వందలాది సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న కైకాల మరణంతో తెలుగు ఇండస్ట్రీతో పాటు ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కామెడీ విలన్‌గా తనకే సాధ్యమైన వైవిధ్యమైన నటనతో తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. 1935లో కృష్ణా జిల్లా, గుడ్ల వల్లేరు మండలం, కౌతవరంలో జన్మించిన ఆయన గుడివాడ, విజయవాడలో విద్యాభ్యాసం పూర్తిచేశారు. 1960లో నాగేశ్వరమ్మతో వివాహం కాగా.. ఇద్దరు కూతుళ్లు, కుమారులు ఉన్నారు. రేపు హైదరాబాద్‌లోని మహా ప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి.
నవరస నట సార్వభౌముడు
ఆరు దశాబ్దాల సినీ కెరీర్‌లో ఆయన పోషించని పాత్ర లేదంటే అతిశయోక్తి కాదు. పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద ఎలాంటి పాత్రలనైనా అవలీలగా చేయడంలో ఆయనకు ఆయనే సాటి. ఈ క్రమంలోనే ‘నవరస నటనా సార్వభౌమ’ అనే బిరుదు పొందారు. అంతేకాదు తెలుగు సినీ పరిశ్రమలో ఎస్‌వీ రంగారావు తర్వాత ఆ స్థాయి పాత్రలు పోషించిన వారిలో సత్యనారాయణ ముందుంటారు. కెరీర్‌లో ఎక్కువగా విలన్ పాత్రలు పోషించినప్పటికీ…. చాలావరకు సినిమాల్లో తండ్రి, తాతయ్య పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. 1959లో విడుదలైన ‘సిపాయి కూతురు’ ఆయన మొదటి చిత్రం కాగా.. 2019లో మహేష్ బాబు ‘మహర్షి’ ఆయన చివరి చిత్రం. ఆయన గంభీరమైన వాయిస్, పర్సనాలిటీ సినీ కెరీర్‌కు చాలా ప్లస్ అయ్యాయి. సీనియర్ ఎన్టీర్ కృషుడిగా రాముడుగా ఎలా అక్కట్టుకున్నారో? పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలు ఎన్ని చేసిప్పటికీ.. యముడి పాత్రలో ఆయన నటనను ఎవరూ మ్యాచ్ చేయలేరనే చెప్పొచ్చు. సీనియర్ ఎన్టీఆర్‌తో ‘యమగోల’ చిత్రం యుముడి పాత్రలో సత్యానారాయణ పొటెన్షియాలిటీ చూపించగా.. ఆ తర్వాతి కాలంలో యముడి పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయారు. ‘యమలీల, యముడికి మొగుడు, యమగోల మళ్లీ మొదలైంది, దరువు’ చిత్రాల్లోనూ ఆయనే యముడిగా నటించారు. అలా కృష్డుడు, రాముడు పాత్రలకు ఎన్టీఆర్ ఎలాగో.. యముడు, దుర్యోధనుడు, భీముడు, ఘటోత్కచుడు పాత్రలకు సత్యనారాయణ కేరాఫ్ అయ్యారు. విలక్షణ విలనిజం..కైకాల సత్యనారాయణలో ప్రతినాయకుడు అన్నాడని కనిపెట్టింది డైరెక్టర్ బి. విఠలాచార్య. ఇది ఆయన సినీ జీవితాన్నే మార్చేసింది. మొదటి సారి ‘కనకదుర్గ పూజా మహిమ’ చిత్రంలో విలన్‌గా నటింపజేశాడు. ఆ తర్వాతి విలన్ పాత్రల్లో ఆయన స్థిరపడి పోయారు. ఈ క్రమంలోనే సహాయక పాత్రలు కూడా పోషిస్తూ సంపూర్ణ నటుడిగా రూపుదిద్దుకున్నారు. తెలుగు పరిశ్రమకు ఎస్వీ రంగారావు లేని లోటును చాలా వరకు సత్యనారాయణ ‘నవరస నట సార్వభౌముడు’ గా భర్తీ చేశారు.
అవార్డులు.. రికార్డులు :
2017 ఫిలి ఫేర్ అవార్డ్స్‌లో కైకాలను జీవితకాల సాఫల్య పురస్కారంతో సత్కరించారు. బంగారు కుటుంబం(1994) చిత్రానికి నంది అవార్డు, 2011లో రఘుపతి వెంకయ్య అవార్డు లభించింది. ప్రత్యేకించి ఒక సాంస్కృతిక సంఘం ఆయనకు ‘నవరసనటనా సార్వభౌమ’ బిరుదును ప్రదానం చేసింది. 777 చిత్రాల్లో నటించిన సత్యానారాయణ 200 మంది దర్శకులతో పనిచేశారు. ఆయన నటించిన 223 సినిమాలు 100 రోజులు ప్రదర్శించబడగా.. 10 సినిమాలు ఒక ఏడాదికి పైగా నిర్మాణ రంగం.. రాజకీయ జీవితం 770 చిత్రాల్లో నటించిన కైకాల సత్యనారాయణ ‘రమా ఫిల్మ్ ప్రొడక్షన్’ సంస్థను స్థాపించి ‘ఇద్దరు దొంగలు, కొదమ సింహం, బంగారు కుటుంబం, ముద్దుల మొగుడు’ సినిమాలు నిర్మించారు. ఆయనకు 2017లో ఫిల్మ్‌ఫేర్ జీవితకాల సాఫల్య పురస్కారం దక్కింది. ఉత్తమ చలన చిత్రం – బంగారు కుటుంబం 1994.. 2011లో రఘుపతి వెంకయ్య అవార్డు వచ్చింది. అంతేకాదు 200 మందికిపైగా దర్శకులతో కైకాల సత్యనారాయణ పనిచేశారు. కైకాల నటించిన 223 చిత్రాలు 100 రోజులు ఆడాయి. సంవత్సరం పైగా 10 సినిమాలు ఆడాయి.. అర్ధశతదినోత్సవాలు జరుపుకున్న సినిమాలు 59 ఉన్నాయి.
భారత పార్లమెంటు మాజీ సభ్యులు
ఎన్టీఆర్‌తో కూడా సత్యనారాయణకు అనుబంధం ఉంది. ఎన్టీఆర్‌తో 100కుపైగా సినిమాల్లో నటించారు. ఎన్టీఆర్ తో పోరాట సన్నివేశాల్లో పోటాపోటీగా నటించారు. ఆ అనుబంధం తోనే 1996లో తెలుగు దేశం పార్టీ లో చేరి రాజకీయాల్లోకి ప్రవేశించి తెలుగుదేశం పార్టీ తరఫున మచిలీపట్నం నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. మచిలీపట్నం నుంచి టీడీపీ తరపున ఎంపీగా విజయం సాధించి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. రెండోసారి పోటీ చేసి కావూరి సాంబశివరావు చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
కైకాల సత్యనారాయణ మరణంపై టీడీపీ అధినేత చంద్రబాబు సంతాపాన్ని తెలిపారు. టీడీపీతో ఆయనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలయ్య సంతాపాన్ని తెలియజేశారు. ఆహార్యం, అభినయం, ఆంగికాలతో అశేషాభిమానుల్నిసంపాదించుకున్న సీనియర్ నటుడు, బహుముఖప్రజ్ఞాశాని కైకాల సత్యనారాయణ మరణం చిత్రపరిశ్రమతోపాటు, తెలుగువారికి తీరనిలోటు అన్నారు. తెలుగు సినీ వినీలాకాశం ఒక గొప్ప ధ్రువతారను కోల్పోవడం విచారకరం అన్నారు. ఎన్టీఆర్ వంటి మహానుభావుడితో కలిసి సాంఘిక, పౌరాణిక, జానపద చిత్రాల్లో కైకాల చూపిన అభినయం ఎన్నటికీ మరువలేనిదన్నారు.
సత్యనారాయణ గారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థి స్తూ, వారి కుటుంబసభ్యులకు, వారి అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సీనియర్ నటుడు, మాజీఎంపీ, విభిన్నపాత్రలతో తెలుగుచితపరిశ్రమలో గొప్పనటుడిగా ఎదిగిన కైకాల సత్యనారాయణ మరణం తెలుగువారికి, సినీపరిశ్రమకు తీరని లోటు అన్నారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.
క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే కైకాలసత్యనారాయణే అనేంతగా ఆయన తననటనతో అశేషాభి మానుల్ని సంపాదించుకున్నారన్నారు. 60 ఏళ్లపాటు చిత్ర పరిశ్రమలో తిరుగులేని నటుడిగా కైకాల ఖ్యాతినార్జించారన్నారు. అలానే 1996లో మచిలీపట్నం (బందరు) ఎంపీగా తెలుగుదేశం నుంచి పోటీచేసిన సత్యనారాయణ ఘనవిజయం సాధించి.. రాజకీయ అరంగేట్రం చేశారన్నారు. సినీ, రాజకీయరంగంలో తనదైన శైలిలో ప్రజ్ఞా పాటవాలతో ప్రజల్ని మెప్పించిన వ్యక్తి మరణం తెలుగుజాతికే తీరనిలోటన్నారు. ఆయన ఆత్మకు శాంతికలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఆయనతో అనుబంధమున్న ప్రతి ఒక్కరూ ఈ సందర్భంగా గత జ్ఞాపకాలను తలచుకుంటూ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నారు. తను పోషించిన పాత్రలతో ఆయా సినిమాలకు నిండుదనం తీసుకొచ్చిన కైకాల సత్యనారాయణ మరణం తెలుగు ఇండస్ట్రీకి, ప్రేక్షకులకు తీరని లోటని సినీ ప్రముఖులు ట్విట్టర్ వేదికగా తమ సంతాపం తెలియజేస్తున్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి హేమాహేమీలు ఇండస్ట్రీలో వెలుగొందిన సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు కైకాల సత్యనారాయణ. విలన్ లేదా క్యారెక్టర్ ఆర్టిస్టుగా పరిమితం కాకుండా విలక్షణ నటనతో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. కొన్ని సినిమాల్లో సెపరేట్ మ్యానరిజంతో ప్రేక్షకులను అమితంగా అలరించారు. ప్రత్యేకించి అమాయకపు కామెడీ విలన్‌గా, యముడిగా ఆయన చేసిన రోల్స్ చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఇలా ఆరు దశాబ్దాల పాటు ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేసిన ఆయన మరణం ఇండస్ట్రీని కలచివేసింది
దీంతో సినీ ప్రముఖులు కైకాల ఆత్మకు శాంతి కలగాలని ట్విట్టర్ వేదికగా విచారం వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.ఈ క్రమంలోనే స్పందించిన రామ్ చరణ్.. ‘కైకాల సత్యనారాయణ గారి మరణవార్త విని చాలా బాధపడ్డాను. మన చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుంది !! వారి ఆత్మకు శాంతి చేకూరు గాక’ అని ట్వీట్ చేశారు. మహేష్ బాబు ట్వీట్ చేస్తూ.. ‘కైకాల సత్యనారాయణ గారు మృతి చెందడం చాలా బాధాకరం. ఆయనతో పనిచేసినందుకు నాకు చాలా మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. చాలా మిస్ అవుతాను. ఆయన కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు నా ప్రగాఢ సానుభూతి. వారి ఆత్మకు శాంతి చేకూరు గాక’ అని తెలిపారు.
మరో టాలీవుడ్ హీరో శర్వానంద్.. ‘ఓం శాంతి. కైకాల సత్యనారాయణ గారు’ అంటూ నమస్కరిస్తున్న సింబల్‌తో వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కైకాల సత్యనారాయణ మృతితో దుఃఖంలో మునిగిపోయినట్లు తెలిపిన రవితేజ.. భారతీయ సినిమా చూసిన అత్యుత్తమ నటుల్లో ఆయన ఒకరని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులతో పాటు ప్రియమైన వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కైకాల సత్యనారాయణ గారి మరణవార్త తెలిసి చాలా బాధ కలిగిందని నందమూరి కళ్యాణ్ రామ్ ట్వీట్ చేశారు. తెలుగు వెండితెరపై ఎన్నో పాత్రలను చిరస్థాయిగా నిలిపిన లెజెండ్ అని పోస్టు చేశారు. లెజెండరీ యాక్టర్ కైకాల సత్యనారాయణ గారి ఆత్మకు శాంతి కలగాలని నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ట్వీట్ చేయగా.. మిమల్ని ఎప్పటికీ కోల్పోతున్నాం అని దర్శకుడు మారుతి ‘రెస్ట్ ఇన్ పీస్ లెజెండ్’ అంటూ ట్వీట్ చేశారు.
హీరో శ్రీకాంత్.. ‘లెజెండరీ యాక్టర్ కైకాలసత్యనారాయణ ఇక లేరనే వార్త విని చాలా బాధపడ్డాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను’ అన్నారు. తెలుగు సినిమా స్వర్ణయుగంలో నాకు ఇష్టమైన నటుల్లో ఒకరు. మన ఇంట్లో మనిషిలా అనిపిస్తారు. లెజెండరీ యాక్టర్. వారి కుటుంబానికి నా సానుభూతి తెలియజేస్తున్నాను’ అని హీరో నాని ట్వీట్ చేశారు. కైకాల మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన గోపీచంద్.. ‘లెజెండరీ యాక్టర్ కైకాల సత్యనారాయణ గారు తన సినిమాల ద్వారా జీవించే ఉంటారు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి’ అని ట్వీట్ ద్వారా సంతాపాన్ని తెలియజేశారు. ‘ఇండస్ట్రీ మరో లెజెండ్‌ను కోల్పోయింది. ‘నవరస నటనా సార్వభౌమ’ టైటిల్ సత్యనారాయణ గారికి సరిగ్గా సరిపోతుంది. విభిన్న, వైవిధ్యమైన పాత్రల్లో అదరగొట్టిన ఆయన అసాధారణ ప్రతిభను తెలుగు ఇండస్ట్రీ మిస్ అవుతుంది. ఆయన కుటుంబానికి బలం చేకూరాలని ప్రార్థిస్తున్నాను’ అని దర్శకుడు శ్రీను వైట్ల ట్వీట్ చేశారు. లెజెండరీ యాక్టర్ కైకాల సత్యనారాయణ గారి మరణవార్త విని చాలా బాధపడ్డాను. ఏ పాత్రకైనా ప్రాణం పోసే అరుదైన నటనా వ్యక్తిత్వం ఆయనది. ఈ దుఃఖ సమయంలో వారి కుటుంబం శాంతి, శక్తిని పొందుగాక! ఓం శాంతి’ అని అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు.