Dimple Hayathi: డింపుల్ ఈ అవకాశాన్నైనా వాడుకుంటుందా?
తెలుగు అమ్మాయి అయినప్పటికీ డింపుల్ హయాతి(Dimple Hayatih) అందాల ఆరబోత విషయంలో ఏ మాత్రం వెనుకాడకుండా ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. గద్దలకొండ గణేష్(Gaddalakonda Ganesh) సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్ లో నటించి తన డ్యాన్సులతో అందరినీ ఆకట్టుకున్న డింపుల్ ఆ సాంగ్ తో బాగా పాపులరైంది. ఆ తర్వాత పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించినప్పటికీ అవేవీ తనకు సక్సెస్ ను అందించలేదు.
అలాంటి డింపుల్ కు ఇప్పుడు మాస్ మహారాజా రవితేజ(Raviteja) సినిమాలో ఛాన్స్ దక్కింది. గతంలో ఆల్రెడీ రవితేజతో కలిసి ఖిలాడీ(Khiladi)లో నటించిన డింపుల్ ఇప్పుడు మరోసారి భర్త మహాశయులకు విజ్ఞప్తి(Bhartha mahasayulaki wignapthi) కోసం ఆయనతో జత కట్టింది. ఈ మూవీలో డింపుల్ తో పాటూ ఆషిక రంగనాథ్(Aashika Ranganath) కూడా నటించగా, సినిమాకు వీరిద్దరి అందాలు, యాక్టింగ్ ప్లస్ అవుతాయని అందరూ భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే మూసగా కొనసాగుతున్న డింపుల్ కెరీర్ కు ఇదే ఆఖరి ఛాన్స్ అని చెప్పొచ్చు. అసలేమాత్రం అవకాశాల్లేని టైమ్ లో డింపుల్ కు మరోసారి రవితేజ సినిమాలో ఛాన్స్ రావడమంటే అదృష్టమనే చెప్పాలి. ఈ అవకాశాన్నైనా డింపుల్ సరిగ్గా వాడుకుని, తన ఖాతాలో హిట్ ను వేసుకుంటుందో లేదో చూడాలి. మరి కొత్త సంవత్సరం అమ్మడికి ఏ మేరకు కలిసొస్తుందో చూడాలి.






