Peddi: పెద్ది షూటింగ్ లేటెస్ట్ అప్డేట్
గేమ్ ఛేంజర్(Game Changer) డిజాస్టర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(ram charan) హీరోగా నటిస్తున్న సినిమా పెద్ది(peddi). విలేజ్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఉప్పెన(uppena) ఫేమ్ బుచ్చిబాబు సాన(buchibabu sana) దర్శకత్వం వహిస్తున్నాడు. పెద్ది సినిమాతో ఎలా అయినా పాన్ ఇండియా స్థాయిలో భారీ సక్సెస్ అందుకోవాలని అటు చరణ్, ఇటు బుచ్చిబాబు చాలా ప్లాన్ చేస్తున్నారు.
అందులో భాగంగానే ఈ సినిమా కోసం రామ్ చరణ్ చాలా కష్టపడుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కోసం మేకోవర్ అయిన చరణ్ పెద్ది లుక్ లో చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. దానికి తోడు సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ షాట్ గ్లింప్స్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో పెద్దిపై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఫస్ట్ సింగిల్ చికిరి(chikiri) కూడా ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం పెద్ది షూటింగ్ ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్నట్టు తెలుస్తోంది. స్పోర్ట్స్ డ్రామా గా రూపొందుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 27న చరణ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ కానుండగా, బాలీవుడ్ భామ జాన్వీ కపూర్(Janhvi Kapoor) పెద్దిలో హీరోయిన్ గా నటిస్తోంది. ఏఆర్ రెహమాన్(AR Rahman) ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు.






