Ashika Ranganath: సింపుల్ లుక్ లోనే అదరగొడుతున్న ఆషికా
క్రేజీ బాయ్(Crazy boy) అనే కన్నడ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆషికా రంగనాథ్(Ashika Ranganath) ప్రస్తుతం రవితేజ(Ravi Teja)తో కలిసి భర్త మహాశయులకు విజ్ఞప్తి(Bhartha Mahasayulaku Wignapti) అనే సినిమాలో నటిస్తోంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా ఈ చిత్ర ప్రమోషన్స్ లో ఆషికా చాలా యాక్టివ్ గా పాల్గొంటుంది. అందులో భాగంగానే తాజాగా ఆషికా ఓ కొత్త ఫోటోషూట్ తో దర్శనమివ్వగా అందులో బ్లూ కలర్ లెహంగాలో అమ్మడు ఎంతో అందంగా కనిపించింది. ఈ ఫోటోల్లో ఆషికా కాటుక కళ్లతో చాలా సింపుల్ లుక్ లోనే కనిపించి అందరినీ ఎంతగానో ఆకట్టుకోగా, ఆ ఫోటోలకు నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తున్నారు.






