Toxic: యశ్ బర్త్ డే స్పెషల్.. ‘టాక్సిక్’ నుంచి పవర్ఫుల్ ‘రాయ’ క్యారెక్టర్ టీజర్ రిలీజ్
రాకింగ్ స్టార్ యశ్ పుట్టినరోజును సందర్భంగా ఆయన హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’ నుంచి ఆయన సినిమాలో చేస్తోన్న క్యారెక్టర్ ఇంట్రో టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్‌తో యష్ నటించిన రాయ పాత్ర పవర్‌ఫుల్‌గా, బోల్డ్‌గా ఉంది. ఫస్ట్ ఫ్రేమ్ నుంచే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేలా ఈ టీజర్‌ను రూపొందించారు. అబిమానులు, సినీ వర్గాలు భారీ అంచనాలతో ఈ సినిమా కోసం వెయిట్ చేస్తోన్న నేపథ్యంలో రాయ పాత్రకు సంబంధించిన క్యారెక్టర్ ఇంట్రో సెలబ్రేషన్స్లా కాకుండా ఓ స్టేట్‌మెంట్‌లా ఉంది.
గమనించాల్సిన విషయమేమంటే.. టాక్సిక్ సినిమాలో తన పాత్ర కంటే ముందు టాక్సిక్ సినిమాలో నటిస్తోన్న ఇతర హీరోయిన్స్ పాత్రలకు సంబంధించిన లుక్స్‌ను విడుదల చేశారు. కియారా అద్వానీ, నయనతార, హుమా ఖురేష్, రుక్మిణి వసంత్, తారా సుతారియా ఇందులో డిఫరెంట్ రోల్స్‌లో కనిపించబోతున్నారు. ప్రతి పాత్రకు ఓ ప్రాధాన్యం ఉంటుందని దీని ద్వారా తెలియజేశారు. టాక్సిక్ కేవలం భారీ బడ్జెట్‌తో రూపొందే సినిమాయే కాకుండా .. ప్రతి పాత్ర పవర్‌ఫుల్‌గా కథను ముందుకు తీసుకెళ్లా ఉంటుందని తెలియజేశారు. అందులో భాగంగా పత్రీ పాత్రను విడుదల చేసి హైప్‌ను పెంచిన మేకర్స్ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ అయిన రాయ వంటి పవర్ఫుల్ పాత్రను పరిచయం చేశారు.
టీజర్‌ను గమనిస్తే.. ఓ శశ్మానంలో కొందరు మాఫియాకు చెందిన వ్యక్తులు గన్స్‌తో కాపలా కాస్తుంటారు. అలాంటి ప్రశాంత వాతారణంలోకి నిశ్శబ్ధాన్ని చేధించేలా ఓ అడుగు పడుతుంది. అదే రాయ. తన రాకతో ఆ ప్రాంతం గన్ఫైరింగ్తో మోగిపోతుంది. అప్పటి వరకు ప్రాణాలతో ఉన్నవారు శవాలుగా మారిపోతారు. ఆ మంచు, పొగ మధ్యలో రాయ అక్కడకి ఎంట్రీ ఇస్తాడు. తన చేతిలో టామీ న్ గన్ ఉంటుంది. ప్రశాంతంగా, ఏమాత్రం వెనకడుగు వేయకుండా, పరిస్థితిపై పూర్తిగా నియంత్రణతో. తొందరపడకుందా ఆ ప్రారంతాన్ని తన కంట్రోల్లోకి తెచ్చుకుంటాడు రాయ.
రాయ తనని తాను ఎవరికోసమో నిరూపించుకోవాలని చూసే వ్యక్తి కాదు. ఆత్మ విశ్వాసంతో లక్ష్యంతో ముందుకు సాగే శక్తి. తన పత్రీ కదలిక తన అధికారాన్ని చాటుతుంది. చూపులో తనేం చేయాలనుకున్నాడనే ఉద్దేశం తెలుస్తుంది.
టాక్సిక్ సినిమాలో తొలి ఫ్రేమ్ నుంచే ఓ చీకటి రాజ్యాన్ని, రాజీ పడని స్వభావాన్ని తెలియజేస్తోంది. కంఫర్ట్‌గా ఉంటే చాలనుకునేలా కాకుండా ధైర్యం, విస్తృతి, దృష్టితో రాజీపడని దానికి స్వాగతం పలుకుతుంది. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసే సినిమా ఇది. ఇప్పుడు వచ్చిన టీజర్ చూస్తుంటే రాయ సాధారణమైన వ్యక్తి కాదు.. టాక్సిక్ సాధారణమైన సినిమా కాదనే విషయం తెలుస్తుంది.
యష్ ప్రయాణాన్ని గమనిస్తే తనొక రిస్క్ టేకర్ అనే విషయం స్పష్టమవుతుంది. చాలా మంది రిస్క్ అని భావించిన ప్రాజెక్ట్సే సరికొత్త నిర్వచనాన్ని సృష్టించాయి. అదే పంథాలో సేఫ్టీ విజన్‌తో సినిమాలు చేయాలనే ఆలోచనతో కాకుండా ఓ లక్ష్యంతో ముందుకు వెళ్లాలనే దానికి ప్రాధాన్యతనిస్తుంటాడు యష్. టాక్సిక్‌తో మరోసారి అలాంటి ప్రయత్నమే చేస్తున్నారు రాకింగ్ స్టార్.
నటుడిగానే కాకుండా ఈ సినిమాతో యశ్ సహ రచయిత, నిర్మాతగానూ మారారు. తనదైన ఆలోచనతో కొత్త ఆలోచనతో ముందుకు వెళుతున్నారు. అందులో భాగంగా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో అంతర్జాతీయ స్థాయిలో సినిమాను రూపొందించటానికి సిద్ధమయ్యారు. గత ఏడాది యశ్పుట్టినరోజు సందర్భంగా వచ్చిన గ్లింప్స్‌ను దృష్టిలో ఉంచుకుని ఈసారి వచ్చిన వీడియో టాక్సిక్ ప్రపంచాన్ని డిఫరెంట్ కథనం, విజువల్స్‌తో మరింత విస్తృతంగా, లోతుగా ఆవిష్కరించేలా కనిపిస్తోంది.
యశ్, గీతూ మోహన్‌దాస్ రాసిన ఈ కథకు గీతూ మోహన్‌దాస్ డైరెక్ట్ చేస్తోన్న ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్ అప్స్’ సినిమాను అంతర్జాతీయంగా ప్రేక్షకులకును మెప్పించేలా ఒకేసారి కన్నడ, ఇంగ్లిష్ భాషల్లో షూట్ చేస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళం, మలయాళం సహా ఇతర భాషల్లో డబ్బింగ్ ద్వారా విడుదల చేస్తున్నారు.
అద్భుతమైన నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు వర్క్ చేస్తున్నారు. సినిమాటోగ్రఫీ బాధ్యతలను నేషనల్ అవార్డు గ్రహీత రాజీవ్ రవి నిర్వహిస్తుండగా.. సంగీతాన్ని రవి బస్రూర్ అందిస్తున్నారు. ఎడిటింగ్‌ను ఉజ్వల్ కులకర్ణి, ప్రొడక్షన్ డిజైన్‌ను టీపీ అబీద్ చూసుకుంటున్నారు. హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ జేజే పెర్రీ (జాన్ విక్ ఫేమ్)తో పాటు నేషనల్ అవార్డు గెలుచుకున్న అన్బరివ్ యాక్షన్ సన్నివేశాలను డిజైన్ చేశారు.
‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’ సినిమాను కెవిఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై వెంకట్ కె.నారాయణ, యశ్ నిర్మిస్తున్నారు. సినిమా 2026 మార్చి 19న ఈద్, ఉగాది, గుడి పడ్వా పండుగలు కలిసి వచ్చే లాంగ్ వీకెండ్ సమయంలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.






