Rajamouli: లేట్ వద్దు.. రూటు మార్చిన జక్కన్న

రాజమౌళి (Rajamouli) సినిమా అనగానే జనాలకు ఎక్కువ సమయం పట్టిస్తుంది అనే అభిప్రాయం ఎక్కువగా ఉంటుంది. బాహుబలి సినిమా తర్వాత నుంచి ఈ అభిప్రాయం ప్రజల్లో ఎక్కువగా ఉంది. బాహుబలి(Bahubali) సినిమాను దాదాపు 5 ఏళ్ళు చేసిన రాజమౌళి ఆ తర్వాత త్రిబుల్ ఆర్ సినిమా విషయంలో కూడా అలాగే వ్యవహరించారు. కరోనా కారణంగా రెండేళ్లు వృధా కావడంతో త్రిబుల్ ఆర్ సినిమా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు మహేష్ బాబు(Mahesh Babu)తో సినిమా చేస్తున్నారు. రాజమౌళి ఈ సినిమా విషయంలో మాత్రం గతం కంటే భిన్నంగా వ్యవహరించాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు.
సినిమా షూటింగ్ అనుకున్న దానికంటే ముందే స్టార్ట్ చేసిన రాజమౌళి సినిమాను ఎక్కువ లేట్ చేయకుండా త్వరగానే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. గత సినిమాలో జరిగిన తప్పులను ఈ సినిమాలో జరగకుండా తీసిన సన్నివేశాలను పదేపదే తీయకుండా జాగ్రత్త పడుతున్నారట రాజమౌళి. రీ షూట్ విషయంలో ఒకటికి పది సార్లు ఆలోచించుకొని మాత్రమే అడుగులు వేయాలని జక్కన్న ప్లాన్ చేసుకుంటున్నారు. రెండు పార్ట్ లుగా వస్తున్న ఈ సినిమాను 2028 నాటికి కంప్లీట్ చేసేయాలని… ఆ తర్వాత బాలీవుడ్ లో అడుగు పెట్టాలని రాజమౌళి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు.
ఇక మహేష్ బాబు కూడా ఈ సినిమా విషయంలో కాస్త జాగ్రత్తగానే ఉంటున్నారు. దాదాపు 5 ఏళ్ల నుంచి మహేష్ బాబుకు సరైన హిట్టు లేదు. అందుకే ఈ సినిమా కోసం తీవ్రంగా కష్టపడుతున్నాడు మహేష్ బాబు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక చోప్రాను దాదాపుగా ఫైనల్ చేశారు. ఇక త్వరలోనే కెన్యాలో షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం హైదరాబాదులోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఇక విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహంను ఫైనల్ చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. మలయాళ హీరోని తీసుకోవాలని భావించినా రెమ్యూనరేషన్ ఎక్కువగా అడగటంతో అతని విషయంలో వెనక్కు తగ్గారట మేకర్స్.