SSMB29: పృథ్విరాజ్ సుకుమారన్ ‘కుంభ’ ఫస్ట్ లుక్ విడుదల
బాహుబలి ఫ్రాంఛైజీ, ట్రిపుల్ ఆర్తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి (SS Rajamouli)దర్శకత్వంలో మహేష్ బాబు (Mahesh Babu)హీరోగా తెరకెక్కతున్న సినిమా గ్లోబల్ ట్రాటర్ ఈవెంట్ అత్యంత ఘనంగా జరగనుంది. ప్రియాంక చోప్రా (Priyanka Chopra)ఈ సినిమాలో నాయికగా నటిస్తున్నారు. భారతదేశం గర్వించదగ్గ సినిమాగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు రాజమౌళి.
ఈ సినిమా నుంచి అప్డేట్లు ఎప్పుడెప్పుడు వస్తాయా? అని ఎదురు చూసిన ప్రేక్షకులకు శుభవార్త అందింది. పృథ్విరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ పోస్టర్ని విడుదల చేశారు విజనరీ డైరక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి. అప్ కమింగ్ మెగా ప్రాజెక్టులో పృథ్విరాజ్ ఫస్ట్ లుక్ ఇంటెన్స్, పవర్ఫుల్ సినిమాటిక్ థీమ్‌తో అద్భుతంగా ఆకట్టుకుంటోంది.
మలయాళం ఇండస్ట్రీ సూపర్ స్టార్ పృథ్విరాజ్ సుకుమార్‌ని కుంభగా పరిచయం చేశారు రాజమౌళి. వరల్డ్ ఆఫ్ గ్లోబ్ ట్రాటర్ నుంచి ఫస్ట్ ఎసెట్ కింద ఈ ఫస్ట్ లుక్‌ని రివీల్ చేశారు. ఏమాత్రం దయాదాక్షిణ్యం లేని, కరడుగట్టిన, కమాండింగ్ ప్రతినాయకుడి పాత్రలో కుంభగా కనిపిస్తున్నారు పృథ్విరాజ్ సుకుమారన్. హెటైక్ వీల్ చెయిర్లో న్యూ ఏజ్ విలన్‌గా ఫస్ట్ లుక్‌లోనే మెప్పించేశారు పృథ్విరాజ్ సుకుమారన్.
రాజమౌళి, మహేష్ బాబు మోస్ట్ యాంబిషియస్ వరల్ట్ బిల్డింగ్ వెంచర్ గ్లోబ్ ట్రాటర్. ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకులు అత్యంత ఆసక్తితో ఎదురుచూసిన వెంచర్ ఇది. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ని, ఫ్యాన్ బేస్‌ని, మాస్ క్రేజ్‌ని సొంతం చేసుకున్న మహేష్‌ని, గ్లోబల్ లెవల్లో పేరు తెచ్చుకున్న రాజమౌళి డైరక్ట్ చేస్తున్నారనే మాట విన్నప్పటి నుంచీ ఉత్సాహం ఉప్పొంగుతూనే ఉంది ఆడియన్స్ లో. వీరిద్దరూ కలిసి చేస్తున్న ఈ జర్నీ ప్రమోషనల్ చాప్టర్ ఈ ఫస్ట్ లుక్ రివీల్ తో మొదలైంది.
ఫస్ట్ లుక్ పోస్టర్ చూసిన ప్రతి ఒక్కరూ ఎస్.ఎస్.రాజమౌళి టచ్ ఉందని ఘంటాపథంగా చెబుతున్నారు. హైప్‌ని నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లడం ఎలాగో ఆయనకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదని మరోసారి మాట్లాడుకుంటున్నారు. ట్రిపుల్ ఆర్ ఆస్కార్ వేదిక మీద చేసిన సందడి తర్వాత, రాజమౌళి ప్రాజెక్టుల మీద విశ్వవ్యాప్తంగా క్రేజ్ మరో రేంజ్లో ఉంది. ఆ స్థాయికి, ఆ ఎదురుచూపులకు తగ్గట్టుగానే ఇప్పుడు ది గ్లోబ్ ట్రాటర్ లాంచ్ ఈవెంట్‌ని ప్లాన్ చేశారు రాజమౌళి. ఇండియన్ సినిమాలోనే ఇంత పెద్ద ఈవెంట్ మునుపెన్నడూ జరగలేదన్నట్టుగా ప్లాన్ చేశారు. ఈ నెల 15న రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ ఈవెంట్ జరగనుంది. ఇప్పటికే ఈ విషయం సినిమా ప్రియుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. ఆ రోజు ఎన్ని విషయాలను రివీల్ చేస్తారో వినడానికి రెడీ అంటున్నారు మూవీ లవర్స్.
రాజమౌళి ఫస్ట్ లుక్ పోస్టర్ని రివీల్ చేస్తామని ఎక్స్ లో అనౌన్స్ చేసినప్పటి నుంచే ఊహాగానాలు మొదలయ్యాయి. వాటన్నిటినీ మించేలా రివీల్ అయింది పోస్టర్. ఫస్ట్ లుక్‌లో పృథ్విరాజ్ రగ్డ్ అవతార్‌లో, కమాండింగ్‌గా కనిపిస్తున్నారు. గ్లోబల్ స్కేల్ అడ్వెంచర్‌కి రాజమౌళి సినిమా ప్రతినాయకుడు ఎలా ఉండాలో.. అచ్చం అలాగే వైబ్ క్రియేట్ చేశారు పృథ్విరాజ్ సకుమారన్.
గ్లోబల్ ట్రాటర్ ఈవెంట్‌కి కొన్నాళ్ల ముందు రివీల్ చేయడంతో ఆల్రెడీ జనాల మధ్య సూపర్ డూపర్‌గా వైరల్ కావడం మొదలైంది పోస్టర్.
నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగే ఈవెంట్ మీద అంఛనాలు విపరీతంగా పెరుగుతూనే ఉన్నాయి.
రాజమౌళి తన పోస్టులో..
“సెట్లో ముగ్గురితో క్లైమాక్స్ షూట్ చేస్తున్నాం. అయినా మరోవైపు గ్లోబ్ ట్రాట్టర్ ఈవెంట్‌కి కావాల్సిన అన్ని ప్రిపరేషన్స్ జరుగుతూనే ఉన్నాయి. ఇంతకు ముందు మేం చేయనిదానికి అతీతంగా ఈ సారి చేయాలనుకుంటున్నాం. నవంబర్ 15న మీరు వాటిని ఎక్స్ పీరియన్స్ చేయడాన్ని చూడ్డానికి ఎంతగానో ఎదురుచూస్తున్నాం” అని రాశారు.
ప్రస్తుతం యూనిట్ క్లైమాక్స్ సీక్వెన్స్ షూట్ చేస్తోందనే అప్డేట్ ఇచ్చారు రాజమౌళి. సినిమాలో అత్యంత ప్రధానమైన ముగ్గురు పాత్రధారులు షూటింగ్లో ఉన్నారని తెలిపారు. త్వరలో జరిగే ఈవెంట్ కి ప్రిపరేషన్లు కూడా భారీగానే ఉన్నాయన్నారు. రాజమౌళి సినిమాల్లో ఇప్పటిదాకా ఎప్పుడూ చూడనంత భారీగా, విస్తారంగా, ఇప్పుడు తెరకెక్కిస్తున్న క్లైమాక్స్ పోర్షన్ ఉండబోతోందన్నది యూనిట్ చెబుతున్న మాట.
పృథ్విరాజ్ ఫస్ట్ లుక్‌తో రాజమౌళి అనౌన్స్ మెంట్ వీక్‌ని ప్రారంభించారు. త్వరలోనే మల్టిపుల్ అప్డేట్స్, సర్ప్రైజులు ప్రేక్షకులకు కనువిందు చేయనున్నాయి. నవంబర్ 15న అత్యంత భారీగా జరగనుంది ఈవెంట్. ఫస్ట్ లుక్‌తో మొదలైన ఈ ప్రమోషన్స్.. నవంబర్ 15న మాసివ్, ఎక్స్ పీరియన్షల్ షోకేస్… వరకు జనాలను ఇంట్రస్టింగ్‌గా లీడ్ చేయనున్నాయన్నది సన్నిహితుల మాట.







