Anna Canteen: అన్న క్యాంటీన్లో భోజనం చేసిన ఎన్నారై
పేదల ఆకలి తీర్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ (Anna Canteen) వ్యవస్థ దిగ్విజయగా నడుస్తోందని, ఇంతమంచి కార్యక్రమానికి తమ వంతు సహకారం అందించే దిశగా ఆలోచిస్తున్నామని ఎన్నారై వెంకట్ ఇక్కుమర్తి (Venkat Ikkumarthi)తెలిపారు. గుంటూరు అమరావతి రోడ్డులోని అన్న క్యాంటీన్‌ను సందర్శించిన ఆయన నిర్వహణ తీరును పరిశీలించారు. భోజనం చేసి ఆహారం రుచి, నాణ్యత బాగున్నాయని కితాబు ఇచ్చారు. అక్కడ తింటున్న వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. మాది గుంటూరు (Guntur)లోని బ్రాడీపేట. 30 ఏళ్లుగా అమెరికా (America)లో ఉంటున్నా. అక్కడి పౌరసత్వం వచ్చింది. రాష్ట్రంలోని అన్న క్యాంటీన్ల గురించి అమెరికాలో మా స్నేహితుల మధ్య చర్చ జరిగింది. ఈసారికి ఇండియాకు వచ్చినందుకున క్యాంటీన్‌ను పరిశీలించా అని వెంకట్ ఇక్కుర్తి పేర్కొన్నారు.






