SVSC: మహేష్ సినిమా ఫ్యాన్స్ మధ్య దూరాన్ని తగ్గిస్తుందా?

ఏదైనా స్టార్ హీరో మూవీ రీ రిలీజ్ అవుతుంటే ఆ హీరోకు సంబంధించిన అభిమానులు మాత్రమే దాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. థియేటర్ల దగ్గర, లోపల అంతా ఆ ఫ్యాన్స్ హడావిడే ఉంటుంది. కానీ కొన్ని సినిమాలకు మాత్రం ఫ్యాన్స్ తో సంబంధం లేకుండా సినీ లవర్స్ అందరూ ఆ సినిమాలను థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయాలనుకుంటారు.
కొన్ని సినిమాలు హీరో ఫ్యాన్స్ మధ్య ఉన్న దూరాన్ని దూరం చేస్తాయి. మురారి(murari) రీరిలీజై అయినప్పుడు థియేటర్లలో ఇలాంటి పరిస్థితులే కనిపించాయి. ఆ సినిమాను కేవలం మహేష్ అభిమానులే కాకుండా మిగిలిన హీరోల ఫ్యాన్స్ కూడా చూసి ఎంజాయ్ చేశారు. ఇప్పుడు అలాంటి మరో సినిమా రీరిలీజ్ కు రెడీ అయింది.
అదే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు(Seethamma Vakitlo Sirimalle Chettu). మహేష్ బాబు(Mahesh Babu), వెంకటేష్(Venkatesh) హీరోలుగా శ్రీకాంత్ అడ్డాల(Srikanth Addala) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో మంచి హిట్ గా నిలిచింది. టైమ్ గడుస్తున్న కొద్దీ ఆ మూవీ కల్ట్ స్టేటస్ ను దక్కించుకుంది. మహేష్ అభిమానులే కాకుండా మిగిలిన వాళ్లు కూడా ఆ సినిమాను ఎంతో ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా మార్చి 7న రీరిలీజ్ కానుంది. ఈ సినిమాను ఎప్పట్నుంచో రీరిలీజ్ చేయమని ఫ్యాన్స్ నిర్మాత దిల్ రాజు(Dil Raju)ను రిక్వెస్ట్ చేస్తుంటే ఇన్నాళ్లకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో ఈ మూవీ రీరిలీజ్ విషయంలో మహేష్ ఫ్యాన్స్ తో పాటూ సగటు సినీ ప్రేక్షకులంతా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు.