Sara Arjun: IMDb లిస్ట్ లో ప్రభాస్, విజయ్ను వెనక్కి నెట్టి మొదటి ప్లేస్ లో సారా
చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయమైన సారా అర్జున్(Sara Arjuna) రీసెంట్ గా దురంధర్(Durandhar) మూవీతో భారీ సక్సెస్ ను అందుకుంది. రణ్వీర్ సింగ్(Ranveer singh) హీరోగా ఆదిత్య ధర్(Aditya Dhar) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి టాక్ తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ దురంధర్ కు థియేటర్లలో మంచి కలెక్షన్లే వస్తున్నాయంటే సినిమా ఏ రేంజ్ సక్సెస్ అయిందో తెలిసిందే.
ఈ సినిమా వల్ల సారా అర్జున్ కు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ సినిమా తర్వాత తన ఫాలోయింగ్ తో పాటూ డిమాండ్ కూడా బాగా పెరిగింది. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో సారా తన యాక్టింగ్ తో అందరినీ మెప్పించింది. కాగా ప్రముఖ ఎంటర్టైన్మెంట్ పోర్టల్ ఐఎండీబీ(IMDb) ప్రతీ వారం పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్ లిస్ట్ ను అనౌన్స్ చేస్తుంది.
ఈ లిస్ట్ లో సారా పాన్ ఇండియా హీరోలైన ప్రభాస్(Prabhas), విజయ్(Vijay) ను వెనక్కి నెట్టి మరీ టాప్ 1 పొజిషన్ ను అందుకుంది. ఈ జాబితాలో విజయ్ 8వ ప్లేస్ లో ఉండగా, ప్రభాస్ 19వ ప్లేస్ లో ఉన్నారు. వీరిద్దరి దాటి మరీ సారా మొదటి ప్లేస్ ను దక్కించుకోవడానికి కారణం దురంధర్ మూవీలో ఆమె చేసిన యాలినా క్యారెక్టర్ అందరినీ ఆకట్టుకోవడం మరియు రణ్వీర్ తో ఆమె కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అవడమేనని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.






