Return of the Dragon: ఓటీటీ లోకి వచ్చేసిన తమిళ్ కామెడీ మూవీ.. ఎక్కడో తెలుసా?
తమిళ సినీ ప్రేక్షకులను అలరించిన రొమాంటిక్ కామెడీ చిత్రం డ్రాగన్ (Dragon movie) అద్భుతమైన విజయాన్ని సాధించింది. లవ్ టుడే సినిమాతో మంచి గుర్తింపు పొందిన ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) ఈ చిత్రంలో హీరోగా నటించి మరోసారి తన ప్రతిభను నిరూపించుకున్నాడు. ఈ చిత్రం తెలుగులో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ (Return of the dragon) పేరుతో విడుదలైంది. ఫిబ్రవరి 21న థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా మొదటి రోజే అద్భుతమైన స్పందన అందుకుంది. యువతను విపరీతంగా ఆకర్షించిన ఈ సినిమా అంచనాలను మించిపోయి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది.
ప్రేక్షకుల మనసులను దోచుకోవడమే కాకుండా, థియేటర్లలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ సినిమా విడుదలైన నెల రోజుల తర్వాత మార్చి 21న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో (Netflix OTT) స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా మార్చి 18న ప్రకటించారు. తమిళంతో పాటు హిందీ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ సినిమా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. మొదట థియేట్రికల్ రన్ బాగుండటంతో ఓటీటీ రిలీజ్ కొంత ఆలస్యం అవుతుందనే ప్రచారం జరిగినా, చివరికి మార్చి 21నే స్ట్రీమింగ్‌కి తీసుకొచ్చారు.
ఈ సినిమాను అశ్వత్ మరిముత్తు దర్శకత్వంలో తెరకెక్కించగా, ప్రదీప్ రంగనాథన్ తన కామెడీ టైమింగ్, నటనతో మరోసారి ప్రేక్షకులను మెప్పించాడు.
సుమారు 37 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైన ఈ చిత్రం థియేటర్లలో 150 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించింది. తమిళంతో పాటు తెలుగులోనూ మంచి వసూళ్లు రాబట్టింది. విడుదలైన తొలిరోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా యూత్ ఆడియన్స్‌ను విశేషంగా ఆకర్షించింది. లవ్ టుడే తర్వాత మరోసారి భారీ విజయం సాధించిన ప్రదీప్ రంగనాథన్ కెరీర్‌కు ఈ సినిమా మరింత ఊపునిచ్చేలా మారింది.
కథ విషయానికొస్తే, రాఘవన్ అనే యువకుడు ఇంజినీరింగ్‌లో 48 బ్యాక్‌లాగ్స్‌తో ఉంటాడు. ఈ సమయంలో అతని గర్ల్‌ఫ్రెండ్ కీర్తితో బ్రేకప్ అవుతుంది. ఆమెకు తాను జీవితంలో గొప్ప విజయాన్ని సాధిస్తానని సవాల్ విసిరిన రాఘవన్, ఫేక్ సర్టిఫికేట్ల సహాయంతో మంచి ఉద్యోగం పొందుతాడు. ఆ తర్వాత పల్లవి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లికి సిద్ధమవుతాడు. కానీ అనుకోని పరిణామాల్లో అతని కాలేజీ ప్రిన్సిపాల్ అతని మోసాన్ని తెలుసుకోవడం తో , ఉద్యోగం పోతుందా లేదా బ్యాక్‌లాగ్స్ క్లియర్ చేసుకోవాలా అనే పరిస్థితి క్రియేట్ చేస్తాడు. చివరికి రాఘవన్ ఏమయ్యాడు, తన సమస్యల నుంచి ఎలా బయటపడ్డాడు అనే ఆసక్తికరమైన అంశాలతో ఈ సినిమా నడుస్తుంది. మొత్తంగా డ్రాగన్ చిత్రం ప్రేక్షకులను మెప్పించి, థియేటర్లలో భారీ విజయం సాధించి, ఇప్పుడు ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధంగా ఉంది. మార్చి 21 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానున్న ఈ సినిమా అందరికీ మంచి వినోదాన్ని అందిస్తుందని చెప్పొచ్చు.







