RGV: వర్మకు ట్రైనింగ్ ఇచ్చి పంపారా…? వర్మ ఏం చెప్పారు..?

వైసీపీ (YSRCP) అధికారంలో ఉన్న సమయంలో సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ.. తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) టార్గెట్ గా పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. సోషల్ మీడియాలో ఆయన అభ్యంతర పోస్టులు కూడా అప్పట్లో సంచలనం అయ్యాయి. దీనిపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో పాటుగా జనసేన కార్యకర్తలు అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కచ్చితంగా రాంగోపాల్ వర్మపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని అందరూ భావించారు.
అయితే రాంగోపాల్ వర్మ మాత్రం అరెస్టు నుంచి తప్పించుకున్నారు. ఇక తాజాగా హైదరాబాద్ నుంచి ఒంగోలు వెళ్లి విచారణకు హాజరయ్యారు రాంగోపాల్ వర్మ. దీనితో ఆయన్ను ఏ ప్రశ్నలు అడిగారు ఏంటి అనేదానిపై సోషల్ మీడియాలో ఆసక్తి నెలకొంది. అయితే ఆయన కొన్ని మార్ఫింగ్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపైన ఎక్కువగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ బాబు.. రాంగోపాల్ వర్మను సుదీర్ఘంగా విచారించారు. ఈ సందర్భంగా.. ఆ ఫోటోలను మీకు వైసీపీ సోషల్ మీడియా పంపించిందా.. లేదంటే వైసీపీ నేతలు ఎవరైనా పంపించారా..? లేదంటే మీరే పోస్ట్ చేశారా అని ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
దీనికి రాంగోపాల్ వర్మ ఆసక్తికర సమాధానం ఇచ్చారట. తనకు వైసిపి నేతలు ఎవరు పంపించలేదని.. వాళ్ళతో స్నేహం ఉన్న మాట వాస్తవమే గాని.. తన సోషల్ మీడియా పోస్టుల విషయంలో మాత్రం వారి ప్రభావం ఏ విధంగా కూడా లేదని, కేవలం తాను మాత్రమే ఆ పోస్టులు చేసినట్లు రాంగోపాల్ వర్మ పేర్కొన్నట్లుగా సమాచారం. ఇక వైసీపీ అధిష్టానం నుంచి గాని లేదంటే ఆ పార్టీ కీలక నేతల నుంచి గాని, మీకు డబ్బు రూపంలో గానీ గిఫ్ట్ రూపంలో గానీ ఏమైనా పంపించారా అనే ప్రశ్నకు రాంగోపాల్ వర్మ సమాధానం దాటవేసినట్లు తెలుస్తుంది.
అయితే తాను డబ్బుల కోసం చేయలేదని. కేవలం తాను దర్శకత్వం వహించిన వ్యూహం సినిమా ప్రమోషన్స్ కోసమే సోషల్ మీడియాలో ఆ పోస్టులు పెట్టానని రాంగోపాల్ వర్మ చెప్పినట్టు తెలుస్తోంది. ఇక రాంగోపాల్ వర్మ విచారణకు వెళ్లే ముందు ఆ పార్టీ కీలక నేతలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి రాంగోపాల్ వర్మను కలిసి చర్చించారు. దీనికి సంబంధించి కూడా పలు ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. ఇక వర్మ చెప్పే సమాధానాలను ముందే వైసీపీ నేతలు వివరించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. అటు వైసీపీ ఆయనకు న్యాయ సహాయం కూడా అందిస్తోంది.