Allu Arjun: త్రివిక్రమ్- బన్నీ గురించి నాగవంశీ ఏం చెప్పాడంటే

పుష్ప2(Pushpa2) సినిమాతో అల్లు అర్జున్(Allu Arjun) సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు. నార్త్ ఇండియాలో రికార్డుల వర్షం కురిపిస్తుంది. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ తర్వాతి సినిమాను త్రివిక్రమ్(Trivikram) దర్శకత్వంలో చేయనున్నట్లు ఇప్పటికే క్లారిటీ వచ్చింది. ఈ సినిమాను చాలా కాలం కిందటే అనౌన్స్ చేశారు. గీతా ఆర్ట్స్(Geetha Arts), హారికా హిసినీ క్రియేషన్స్(Harika Hassine creations) సంయుక్తంగా ఈ ప్రాజెక్టును నిర్మించనున్నాయి.
ఈ సినిమాను త్రివిక్రమ్ పాన్ ఇండియా స్థాయిలో ఎవరూ టచ్ చేయని జానర్ లో రూపొందించనున్నాడు. ఈ మూవీ గురించి నిర్మాత నాగవంశీ(Naga Vamsi) తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. ఇప్పటికే త్రివిక్రమ్-బన్నీ(bunny) సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ దాదాపు పూర్తైందని, బన్నీ ఖాళీ అవగానే త్రివిక్రమ్ తో ఓ సారి అన్నీ డిస్కస్ చేసుకుంటారని తెలిపాడు
అంతేకాదు, మూవీలో హీరో క్యారెక్టర్ బాడీ లాంగ్వేజ్ కోసం, తెలుగు భాష మీద మరింత పట్టు తెచ్చుకోవడానికి కనీసం మూడు నెలల టైమ్ పడుతుందని, ఇదంతా అయ్యే సరికి సమ్మర్ వస్తుందని, సినిమాను మెల్లిగా సమ్మర్ తర్వాత స్టార్ట్ చేద్దామనుకుంటున్నట్లు, ఎంతలేదన్నా సినిమాకు రెండేళ్ల టైమ్ పడుతుందని, 2026 ఎండింగ్ కు సినిమా రిలీజ్ కు రెడీ అయ్యే ఛాన్స్ ఉందని వంశీ వెల్లడించాడు. సినిమాలో సెట్ వర్క్ భారీగా ఉంటుందని, వీఎఫ్ఎక్స్ కూడా ఎక్కువగా ఉంటాయని అందుకే ఓ ఏరియాలో ల్యాండ్ తీసుకుని అందులో సెట్స్ వేయాలని చూస్తున్నట్లు వంశీ తెలిపాడు. వంశీ చెప్పినదాన్ని బట్టి చూస్తే బన్నీ తర్వాతి సినిమాను స్టార్ట్ చేయడానికి ఎంత లేదన్నా మరో ఐదు నెలల టైమ్ పట్టేలా ఉంది.