Prabhas: హైదరాబాద్ లో రెబల్ క్రేజ్ వేరే లెవెల్

ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ ఎక్కువగా కనబడుతోంది. స్టార్ హీరోల కెరియర్ లో సూపర్ హిట్ అయిన సినిమాలను మళ్లీ థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలకు బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ వస్తోంది. మార్చి నెలలో బాక్సాఫీస్ వద్ద పెద్దగా కలెక్షన్లు ఉండవు. అయినా సరే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. లేటెస్ట్ గా రీ రిలీజ్ అయిన సలార్ సినిమాకు కూడా అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.
రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas), ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన సలార్ (Salaar) పార్ట్ వన్ 2023లో ప్రపంచవ్యాప్తంగా విడుదలై దాదాపు 700 కోట్ల రూపాయలను వసూలు చేసింది. చాన్నాళ్ల తర్వాత ప్రభాస్ కెరియర్ లో అది భారీ హిట్ అనే చెప్పాలి. బాహుబలి తర్వాత వరుసగా మూడు సినిమాలు ఫ్లాప్ కాగా.. సలార్ సినిమాతో ప్రభాస్ మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు. ఇక ఈ సినిమాను మార్చి 21న అంటే శుక్రవారం రీ రిలీజ్ చేశారు మేకర్స్. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటుగా నార్మల్ ఆడియన్స్ కూడా థియేటర్లకు క్యూ కట్టారు.
రిలీజ్ కి ముందే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ తో 1.85 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. రిలీజ్ సందర్భంగా టైటిల్ కార్డు కూడా ప్రభాస్ ఫ్యాన్స్ కు పిచ్చపిచ్చగా నచ్చేసింది. ప్రభాస్ చిన్ననాటి ఫోటో నుంచి పెద్దయిన తర్వాత ఫోటోలు.. తొలి సినిమా ఈశ్వర్ నుంచి మొన్న వచ్చిన కల్కి సినిమా వరకు ప్రతి సినిమాలోని స్టిల్స్ తో టైటిల్ కార్డును అద్భుతంగా క్రియేట్ చేశారు. ఇక ఈ సినిమాకు హైదరాబాదులోనే 200 స్క్రీన్ లను కేటాయించారంటే సినిమా క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.