Prabhas: బాక్సాఫీస్ బంగారు బాతు రెబల్ స్టార్

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) సినిమా రిలీజ్ అవుతుందంటే.. ఇండియా షేక్ అవుతుంది. ప్రభాస్ సినిమాలకు మాస్ ఆడియన్స్ తో పాటుగా క్లాస్ ఆడియన్స్ లో కూడా పిచ్చ క్రేజ్ ఉంటుంది. అందుకే ప్రభాస్ తన సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు. భారీ బడ్జెట్ సినిమాలను కూడా చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేసేసే ప్రభాస్.. ఇప్పుడు ఫ్యాన్స్ ను ఎక్కడా ఇబ్బంది పెట్టకూడదని టార్గెట్ పెట్టుకున్నాడు. రాబోయే మూడు నాలుగేళ్లలో ఏకంగా ఏడు నుంచి ఎనిమిది సినిమాలు రిలీజ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్న ప్రభాస్.. అంతే వేగంగా పని కూడా చేస్తున్నాడు.
రీసెంట్ గా కాలి గాయం నుంచి కోలుకున్న ప్రభాస్.. ఇప్పుడు రాజా సాబ్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత హను రాఘవపూడి డైరెక్షన్ లో ఓ సినిమా మొదలుపెట్టనున్నాడు. ఆ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత సందీప్ రెడ్డి వంగ(Sandeep Reddy Vanga)తో చేయబోయే స్పిరిట్ సినిమా షూటింగ్లో పాల్గొంటాడు. ఇక ఇది ఇలా ఉంటే… గత తొమ్మిదేళ్లలో ప్రభాస్ ఏడు సినిమాలు రిలీజ్ చేయగా ఈ ఏడు సినిమాలు.. 5300 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసినట్లు బాక్సాఫీస్ లెక్కలు చెబుతున్నాయి.
అలాగే ఫస్ట్ రోజు ఈ ఏడు సినిమాలు 100 కోట్లకు పైగా వసూలు చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇండియాలో ఏ హీరోకు ఈ రికార్డ్ లేదంటే ప్రభాస్ ఇప్పుడు బాక్స్ ఆఫీస్ కు బంగారు బాతు అనేది క్లియర్ గా అర్థం అవుతుంది. ఏకంగా కొన్ని సినిమాలయితే 900 కోట్ల రూపాయలను కూడా క్రాస్ చేసాయి. కల్కి సినిమా అయితే 1200 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఇక బాహుబలి 2 కలెక్షన్స్ గురించి అందరికీ తెలిసిందే. 1800 కోట్ల రూపాయలు వసూలు చేసి సరికొత్త రికార్డులను ఆ సినిమా అప్పట్లో క్రియేట్ చేసింది. ఇటీవల ఆ రికార్డులను పుష్ప సీక్వెల్ బ్రేక్ చేసింది. ఇప్పుడు రాబోయే సినిమాలు కూడా మరిన్ని రికార్డులను బ్రేక్ చేయడం ఖాయమని ఫాన్స్ ధీమాగా ఉన్నారు. ప్రతి సినిమా భారీ బడ్జెట్ తో వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభాస్ కు ప్లస్ పాయింట్ అవుతుందని.. పాన్ ఇండియా వైడ్ గా ప్రభాస్ కు క్రేజ్ ఉండటం కలిసి వచ్చే అంశం అని భావిస్తున్నారు.