Peddi: పెద్ది ఫస్ట్ సింగిల్ అప్పుడేనా?
గేమ్ ఛేంజర్(game changer) సినిమాతో భారీ డిజాస్టర్ ను అందుకున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(ram charan) ప్రస్తుతం ఉప్పెన(uppena) ఫేమ్ బుచ్చిబాబు సాన(buchibabu sana) దర్శకత్వంలో పెద్ది(Peddi) అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. విలేజ్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్(janhvi Kapoor) హీరోయిన్ గా నటిస్తుండగా ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతుంది.
గేమ్ ఛేంజర్ డిజాస్టర్ అవడంతో అటు చరణ్ ఫ్యాన్స్, చరణ్ కూడా ఈ సినిమా పైనే తమ ఆశలన్నింటినీ పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తోంది. త్వరలోనే పెద్ది నుంచి మ్యూజికల్ ట్రీట్ రాబోతుందని అంటున్నారు. కాగా ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్(AR Rahman) సంగీతం అందిస్తున్న విషయం విదితమే.
రెహమాన్ కంపోజిషన్ లో ట్యూన్ అయిన ఫస్ట్ సింగిల్ కు ముహూర్తం ఫిక్స్ అయిందని, ఆగస్ట్ ఆఖరిలో రాబోతున్న వినాయక చవితికి పెద్ది ఫస్ట్ సింగిల్(peddi first single) ను లాంచ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. ఇందులో నిజమెంతన్నది ఇంకా తెలియదు కానీ ఒకవేళ నిజంగానే వినాయక చవితికి పెద్ది ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేస్తే పండగ సంబరాలకు ఆ సాంగ్ మోత మోగిపోవడం ఖాయం.






