Pawan Kalyan: భవిష్యత్ సినిమాలపై పవన్ క్లారిటీ.. ఖుష్ అవుతున్న ఫ్యాన్స్..

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రాజకీయాల్లో బిజీగా ఉన్నా, సినిమాలను పూర్తిగా మానేయలేరు. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా (AP Deputy CM) బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే అభిమానులలో, సినీ ప్రేమికులలో ఒకే సందేహం ఉంది—ఇకపై కొత్త సినిమాలు చేస్తారా లేదా? ఇప్పటికే ‘హరిహర వీరమల్ల ( Harihara VeeraMallu) ‘ఓజీ’ (OG) సినిమాలు పాక్షికంగా మిగిలి ఉన్నాయి. ఇక ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustadh Bhagat Singh) ప్రారంభమవుతుందా లేదా అన్నది ఇంకా స్పష్టత రాలేదు. ఇదే సమయంలో, గతంలో సురేందర్ రెడ్డితో ఓ సినిమా చేయాల్సి ఉండగా, అది క్యాన్సిల్ అయినట్టు టాక్ వినిపిస్తోంది.
తాజాగా తమిళ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ తన ఆలోచనలను వెల్లడించారు. అయితే సినిమాలు పాలనకు ఏమాత్రం నష్టం కలిగించకుండా ఉండేలా రెండు పనులను బ్యాలెన్స్ చేసుకునే విధంగా ప్లాన్ చేసుకుంటానని చెప్పారు. జనసేన పార్టీ కార్యకలాపాలు, సహాయ కార్యక్రమాలు, విరాళాలు, పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం ఆర్థికంగా బలంగా ఉండాలి. అందుకే సినిమాలు పూర్తిగా వదిలేయలేరు. అయితే చెప్పడం ఒకటి, అమలు చేయడం మరో విషయం. ఇప్పటికే ఆయన డిప్యూటీ సీఎం బాధ్యతలతో బాగా బిజీగా ఉన్నారు. అందుకే ‘హరిహర వీరమల్లు’ సినిమా విడుదల మళ్లీ వాయిదా పడింది.
ఇప్పుడున్న పరిస్థితిలో పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలను ఒప్పుకోవడం కొంత కష్టమే. ఓ సినిమా మొదలు పెడితే, దానికి కావాల్సిన సమయం, న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంటుంది. అయితే, పాలన పూర్తిగా స్థిరపడిన తర్వాత క్రమంగా సినిమాల కోసం కూడా సమయం కేటాయించవచ్చు. ఇప్పటివరకు ఆయన పూర్తిగా పాలనపై దృష్టి పెడుతున్నారు. ప్రభుత్వం అమలు చేసే పనులు సక్రమంగా సాగిన తర్వాత మాత్రమే సినిమాల పై దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది
సినిమా పట్ల ఆయన ఆసక్తి తగ్గలేదని, కానీ తక్కువ రోజుల్లో పూర్తయ్యే ప్రాజెక్టులను మాత్రమే ఎంచుకుంటే సులభమని అర్థమవుతోంది. ‘భీమ్లా నాయక్,’ ‘వకీల్ సాబ్,’ ‘బ్రో’ లాంటి చిన్నకాల ప్రాజెక్టులు చేయడం వల్ల ఆయనకు సమయం సులభంగా లభిస్తుంది. కానీ ‘హరిహర వీరమల్లు,’ ‘ఓజీ’ లాంటి భారీ పాన్-ఇండియా సినిమాలు కష్టతరమే. ఏదేమైనా, ఈ నెల 9న విడుదల కాబోయే ‘ఓజీ’తో పవన్ కళ్యాణ్ మరలా వెండితెరపై కనిపించబోతున్నారు. అభిమానులు ఆయనను తెరపై చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.