Pawan Kalyan: 4 రోజులు ప్లీజ్ పవన్…!

జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రాజకీయాల్లో అడుగుపెట్టిన తర్వాత సినిమాలపై పెద్దగా ఫోకస్ పెట్టలేదు. 2014 నుంచి ఆయన సినిమాల విషయంలో అంతగా ఆసక్తి చూపించలేదు. ఇక ఆయన సినిమాలు కూడా గొప్పగా ఆడక పోవడంతో పవన్ కళ్యాణ్ కూడా సినిమాల విషయంలో ఇంట్రెస్ట్ చూపించలేదు. గబ్బర్ సింగ్ సినిమా తర్వాత.. పవన్ కళ్యాణ్ కొట్టిన హిట్లు భారీవి ఏమి కాదు. ఇక ఆయన అభిమానులు కూడా పవన్ కళ్యాణ్ సినిమాల్లో సైతం రాణించాలని కోరుతున్నారు.
2024లో 100% స్ట్రైక్ రేటుతో అసెంబ్లీలో అడుగుపెట్టిన జనసేన (Janasena) పార్టీ ఇప్పుడు క్రమంగా బలపడుతుంది. దీనితో పవన్ కళ్యాణ్ ఎక్కువగా రాజకీయాలపై ఫోకస్ పెడుతున్నారు. అటు ప్రభుత్వంలో కూడా పవన్ కళ్యాణ్ బిజీగా ఉంటున్నారు. ఉప ముఖ్యమంత్రి పదవితో పాటుగా ఆయన వద్ద ఉన్న శాఖలను పరుగులు పెట్టించేందుకు పవన్ కళ్యాణ్ నానా కష్టాలు పడుతున్నారు. అయితే ఈ మధ్యకాలంలో సినిమాలపై కూడా పవన్ కళ్యాణ్ ఫోకస్ పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ అనుకున్న విధంగా వాతావరణం మాత్రం కనబడటం లేదు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాల్లో దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న సినిమా హరిహర వీరమల్లు (Harihara Veeramallu). ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో కూడా క్లారిటీ రావడం లేదు. పవన్ కళ్యాణ్ నాలుగు రోజులు డేట్స్ ఇస్తే రిలీజ్ డేట్ మార్చకుండా అదే రోజున సినిమాను రిలీజ్ చేయాలని టార్గెట్ పెట్టుకొని డైరెక్టర్ జ్యోతి కృష్ణ వర్క్ చేస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం డేట్స్ ఇచ్చే పరిస్థితి కనబడటం లేదు. ఇక మరో రెండు సినిమాలు కూడా పవన్ కళ్యాణ్ కోసం ఎదురు చూస్తున్నాయి.
అయినా సరే పవన్ మాత్రం వాటికి కూడా క్లారిటీ ఇవ్వటం లేదు. ఇటీవల పది రోజులు రెగ్యులర్ గా షూటింగ్ లో పాల్గొన్న ఆయన ఇప్పుడు మళ్ళీ షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారు. దీనితో ప్రొడ్యూసర్లు, డైరెక్టర్ పవన్ కళ్యాణ్ షూటింగ్ కు రావాలని త్వరగా డేట్స్ ఇచ్చేసి.. షూటింగ్ కంప్లీట్ చేస్తే తాము సినిమాను స్టార్ట్ చేస్తామని, నాలుగు రోజులు షూటింగ్ చేస్తే పవన్ కళ్యాణ్ పోర్షన్ కంప్లీట్ అయిపోతుందని రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ దీనిపై ఏ డెసిషన్ తీసుకుంటారో చూడాలి. అన్నీ అనుకునట్లు జరిగితే మార్చ్ లో సినిమా రిలీజ్ కావాల్సి ఉంది.