Nandamuri: నందమూరి అభిమానులకు వెయిటింగ్ తప్పదా..?

నందమూరి మోక్షజ్ఞ (Nandamuri Mokshagna) సినిమా ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఎప్పటినుంచొ ఎదురుచూస్తున్నారు. అయినా సరే ఇప్పటివరకు దీనిపై క్లారిటీ రావడం లేదు. ప్రశాంత్ వర్మ(Prasanth Varma) తో సినిమా మొదలుపెట్టిన సరే ఆ సినిమా అసలు ఎప్పుడు మొదలవుతుందో కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి. షూటింగ్ డిసెంబర్ లో మొదలవుతుందని కొన్ని రోజుల ప్రచారం జరిగింది. ఆ తర్వాత జనవరిలో స్టార్ట్ అవుతుందని కొంతమంది మాట్లాడారు. ఇక ఫిబ్రవరి మూడో వారం నుంచి సినిమా కంటిన్యూగా షూటింగ్ కు వెళ్తుందని కూడా కామెంట్స్ వచ్చాయి.
కానీ ఇప్పటివరకు అసలు ఆ సినిమా పరిస్థితి ఏంటో కూడా ఎవరికి తెలియదు. అటు నందమూరి బాలకృష్ణ ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. అందుకే బడ్జెట్ విషయంలో కూడా ఎక్కడ రాజీ పడకుండా ప్లాన్ చేసుకున్నారు. బాలకృష్ణకు కథ బాగా నచ్చడం, దానికి తోడు హనుమాన్ సినిమాతో ప్రశాంత్ తానేంటి అనేది ప్రూవ్ చేసుకోవడంతో ఖచ్చితంగా తన వారసుడికి అతను కరెక్ట్ డైరెక్టర్ అని భావించాడు. కానీ ఇప్పటివరకు ఆ సినిమా మాత్రం ముందుకు వెళ్లలేదు. దీనితో అసలు బాలకృష్ణ ఏం చేయబోతున్నారనేది కూడా క్లారిటీ లేదు.
ఇలాంటి టైం లో ప్రశాంత్ వర్మ ఊహించని షాక్ ఇచ్చాడు. బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ తో చేయాలనుకున్న బ్రహ్మరాక్షస్ అనే సినిమాను రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) తో తెరికెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. దీనికోసం హైదరాబాదులోని రామానాయుడు స్టూడియోలో.. ఒక లుక్ టెస్ట్ కూడా ప్లాన్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. వారం, 10 రోజుల్లో దీనికి సంబంధించి ఒక వీడియో కూడా రికార్డు చేసి దాన్ని సోషల్ మీడియాలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు ప్రచారం మొదలైంది. దీనితో మోక్షజ్ఞతో సినిమా ఆగిపోయినట్లే అనే వార్తలు వస్తున్నాయి.
ఆ సినిమా గురించి అటు బాలకృష్ణ కూడా పెద్దగా పట్టించుకోవడంలేదని, మరో డైరెక్టర్ తో సినిమాను ఓకే చేయించారని కూడా అంటున్నారు. ప్రశాంత్ వర్మ గతంలో కూడా ఒకటి రెండు సినిమాలు మొదలుపెట్టి సడన్ గా ఆపేసిన పరిస్థితి. ఇప్పుడు ఈ సినిమా పరిస్థితి కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంది అనే టాక్ వినబడుతోంది. దీనితో నందమూరి అభిమానులు అసలు ఏం జరుగుతుందో అర్థం కాక ఏదో ఒకటి చేసి.. మోక్షజ్ఞను సినిమాల్లోకి తీసుకురావాలని కోరుతున్నారు.