Nani#34: #నాని34, విక్టరీ వెంకటేష్ క్లాప్ తో గ్రాండ్ గా లాంచ్

మాన్ ఆఫ్ ది మొమెంట్, వరుస సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్లతో తెలుగు సినిమా ప్రేక్షకులను అలరిస్తున్న వెర్సటైల్ యాక్టర్ నాని, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తన భారీ చిత్రం #Nani34ని అనౌన్స్ చేశారు. ఇది ఒక అంబిషస్ సినీమాటిక్ జర్నీకి ఆరంభం. ఈ పవర్‌ప్యాక్ ప్రాజెక్ట్‌కి ‘ఓజీ’ మెగా బ్లాక్‌బస్టర్‌తో భారీ విజయాన్ని అందుకున్న స్టైలిష్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్యాషనేట్ ప్రొడ్యూసర్ వెంకట్ బోయనపల్లి (నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్), అలాగే నాని స్వంత నిర్మాణ సంస్థ యూనానిమస్ ప్రొడక్షన్స్ కలిసి నిర్మిస్తున్నాయి. ఈ కాంబినేషన్ గ్రాండ్ స్కేల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కి గ్యారంటీ ఇస్తోంది.
దసరా శుభ సందర్భంగా ఈ సినిమా లాంచ్ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఆ వేడుకకు విక్టరీ వెంకటేష్ హాజరై, ఫస్ట్ క్లాప్ కొట్టి బెస్ట్ విషెష్ అందించారు.
నాని తండ్రి రాంబాబు ఘంటా కెమెరా స్విచ్ ఆన్ చేయగా, నాని, నిర్మాత వెంకట్ బోయనపల్లి కలిసి స్క్రిప్ట్‌ను దర్శకుడు సుజీత్‌కి అందించారు. ఫస్ట్ షాట్ కి దర్శకులు రాహుల్ సంకృత్యాన్, శ్రీకాంత్ ఒదెల, శౌర్యువ్ కలిసి గౌవర దర్శకత్వం వహించారు.
ఈ వేడుకకు దర్శకుడు రామ్ జగదీష్, నిర్మాత సుధాకర్ చెరుకూరితో పాటు పరిశ్రమలోని ప్రముఖులు హాజరయ్యారు.
#Nani34 నాని కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం. ప్రపంచ స్థాయి ప్రొడక్షన్, టెక్నికల్ విలువలతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం విజువల్ స్పెక్టకిల్‌గా నిలవనుంది.
యాక్షన్, ఎమోషన్, నాని సిగ్నేచర్ హ్యూమర్ మేళవింపుతో అన్ని వయసుల ప్రేక్షకులకు నచ్చే యూనివర్సల్ ఎంటర్‌టైనర్‌గా రాబోతోంది.
స్క్రిప్ట్‌లో యాక్షన్, ఎమోషన్, ఎంటర్‌టైన్‌మెంట్‌ని అద్భుతంగా బ్యాలెన్స్ చేస్తూ, నానిని ఎప్పుడూ చూడని పాత్రలో చూపించబోతున్నారు సుజీత్.
ఈ ప్రాజెక్ట్ ప్రతీ ఎలిమెంట్ హయ్యెస్ట్ స్టాండర్డ్స్‌కి చేరుకునేలా తీర్చిదిద్దుతామని నిర్మాత వెంకట్ బోయనపల్లి తెలిపారు.
#Nani34 కోసం అభిమానులు మాత్రమే కాదు, పరిశ్రమ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అద్భుతమైన టీమ్, గ్రాండ్ స్కేల్ కలిగిన ఈ ప్రాజెక్ట్ రాబోయే ఏడాది మోస్ట్ ఎవైటెడ్ తెలుగు చిత్రాల్లో ఒకటిగా నిలవనుంది,