Zee Telugu: ఓదెల 2, ఈ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు, మీ జీ తెలుగులో!

వారం వారం సరికొత్త సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న జీ తెలుగు (Zee Telugu) దసరా పండగ సందర్భంగా సూపర్ హిట్ సినిమాతో మీ ముందుకు రానుంది. థియేటర్, ఓటీటీలోనూ ప్రేక్షకులను ఆకట్టుకున్న సెన్సేషనల్ మూవీ ‘ఓదెల 2’ (Odela2). 2022లో ఓటీటీ వేదికగా అలరించిన ‘ఓదెల రైల్వేస్టేషన్’ సినిమాకి సీక్వెల్గా రూపొందిన ఓదెల 2, ఈ ఆదివారం (అక్టోబర్ 5) మధ్యాహ్నం 3 గంటలకు, మీ జీ తెలుగులో మాత్రమే!
ఓదెల గ్రామంలో అనేక దారుణాలు చేసిన తిరుపతి (వశిష్ఠ) ని ఆ గ్రామస్థులు సమాధి చేసిన ఆరు నెలలకే మళ్ళీ ఒక భయంకర ఆత్మగా బయటకి వస్తాడు. అలా వచ్చి మళ్ళీ ఓదెలలో మరింత విధ్వంసం సృష్టిస్తాడు.అతడిని కట్టడి చేసేందుకు గ్రామస్తులు శివ శక్తి అయిన భైరవి (తమన్నా భాటియా) సహాయాన్ని కోరతారు. తిరుపతి మరణం వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? భైరవి ఓదెల గ్రామానికి ఎందుకు వచ్చింది? అనే విషయాలు తెలియాలంటే జీ తెలుగులో ప్రసారమయ్యే ఓదెల 2 సినిమా చూడాల్సిందే! అశోక్ తేజ దర్శకత్వంలో డి. మధు నిర్మించిన ఈ సినిమాలో తమన్నా భాటియా ప్రధాన పాత్రలో అలరించగా హెబ్బా పటేల్, వశిష్ఠ ముఖ్యపాత్రలు పోషించారు.
సూపర్ నేచురల్ థ్రిల్లర్గా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఓదెల 2.. ఈ ఆదివారం, మీ జీ తెలుగులో.. తప్పక చూడండి!