Mrunal Thakur: అమ్మను కావాలనుంది
మరాఠీ భామ, టాలీవుడ్ సక్సస్ఫుల్ హీరోయిన్ గా రాణిస్తున్న మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) ముందు బాలీవుడ్ లో పలు సినిమాలు చేశారు. కానీ అవేమీ అమ్మడికి స్టార్ స్టేటస్ ను తీసుకురాలేదు. ఎప్పుడైతే మృణాల్ తెలుగులో సీతారామం సినిమా చేసిందో అప్పుడే తెలుగు ఆడియన్స్ ఆమెను తమ హీరోయిన్ అనుకున్నారు. ఆ సినిమా తర్వాత మృణాల్ కు ఆఫర్లు కూడా బాగా వచ్చాయి.
ప్రస్తుతం టాలీవుడ్ లో డెకాయిట్(Dacoit) సినిమాతో పాటూ బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తోంది మృణాల్. ప్రస్తుతం ఆమె నటించిన సన్నాఫ్ సర్దార్2(Son Of Sardar) రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈ నేపథ్యంలో ఆ సినిమా ప్రమోషన్స్ లో మృణాల్ పాల్గొంటున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మృణాల్ ఠాకూర్ పెళ్లి, పిల్లలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
తనక్కూడా అందరిలానే త్వరగా పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలనుందని, ఫ్యూచర్ లో భర్త, పిల్లలతో కలిసి ఉన్న జీవితం గురించి రెగ్యులర్ గా కలలు కంటూ ఉంటానని, కానీ ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం సినీ కెరీర్ పైనే ఉందని, కెరీర్ పరంగా సంతృప్తి పొందిన తర్వాతే పర్సనల్ లైఫ్ పై ఫోకస్ చేస్తానని మృణాల్ వెల్లడించగా ప్రస్తుతం ఆ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.







