Megastar: మెగా ఫ్యాన్స్ పూజలు, కారణం అదే
మెగాస్టార్ ఫ్యామిలీ సినిమాలు అనగానే టాలీవుడ్ లో ఒక తెలియని క్రేజ్ ఉంటుంది. దశాబ్దాలుగా టాలీవుడ్ లో ఒక ఊపు ఊపుతున్న మెగా ఫ్యామిలీ, గత కొంతకాలంగా మాత్రం ఇబ్బంది పడుతోంది. ఏ సినిమా రిలీజ్ అయినా సరే ఫ్లాప్ అవుతోంది. ఒక్క అల్లు అర్జున్(Allu Arjun) మినహా మిగిలిన హీరోలు అందరూ గత కొన్నేళ్ళుగా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. రామ్ చరణ్.. త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత ఒక్క హిట్ కూడా కొట్టలేదు. ఆ తర్వాత చిరంజీవి పరిస్థితి కూడా దాదాపు అలాగే ఉంది.
రీఎంట్రీ తర్వాత వాల్తేరు వీరయ్య సినిమా మాత్రమే హిట్ అయింది. ఆ సినిమాలో కూడా రవితేజ ఉండటంతో చిరంజీవికి పెద్దగా క్రెడిట్ దక్కలేదనే చెప్పాలి. ఒకవైపు నందమూరి ఫ్యామిలీతో పాటుగా అల్లు అర్జున్ కూడా విజయాలతో దూసుకుపోతున్న సమయంలో, మెగా ఫ్యామిలీ హీరోల సినిమాలు ఫ్లాప్ కావడం, మెగా ఫ్యాన్స్ కు కాస్త ఇబ్బందికరంగానే ఉంది. ఇతర హీరోలను మెగా ఫాన్స్ కాస్త దూకుడుగా విమర్శిస్తూ ఉంటారు. ఇప్పుడు వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.
సోషల్ మీడియాలో వేరే హీరోలను ట్రోల్ చేసే విషయంలో మెగా ఫాన్స్ ఎక్కడ వెనకడుగు వేయడం లేదు. ఇప్పుడు మెగా హీరోల సినిమాలు ఫ్లాప్ కావడంతో, ఇతర హీరోల ఫ్యాన్స్ మెగా ఫాన్స్ ను టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఇలాంటి సమయంలో మెగాస్టార్ చిరంజీవి సోలోగా వస్తున్న విశ్వంభర సినిమాపై మెగా ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పటినుంచో జరుగుతోంది. వాస్తవానికి డిసెంబర్ లో విడుదలవుతుందని ప్రచారం జరిగింది.
ఆ తర్వాత గేమ్ చేంజర్ సినిమా కోసం ఈ సినిమాను వాయిదా వేశారు చిరంజీవి. మళ్ళీ వేసవిలో సినిమా రిలీజ్ అవుతుందని ప్రచారం జరిగింది. కానీ కొన్ని కారణాలతో సినిమా వాయిదా పడింది. ప్రస్తుతం షూటింగ్ కూడా వాయిదా పడినట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా, సినిమా గురించి ఆసక్తికర అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. ఇప్పటికే పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హరిహర వీరమల్లు సినిమా కూడా ఫ్లాప్ కావడంతో మెగా ఫ్యాన్స్ మరింత ఇబ్బంది పడుతున్నారు. ఈ సమయంలో చిరంజీవి సినిమా కాపాడాలంటూ ఫ్యాన్స్ పూజలు చేస్తున్నారు.






