Mansion House Mallesh: అడివి శేష్ లాంచ్ చేసిన శ్రీనాథ్ మాగంటి ‘మెన్షన్ హౌస్ మల్లేష్’ ఫస్ట్ సాంగ్

శ్రీనాథ్ మాగంటి, (Srinath Maganti)గాయత్రి రమణ, Gayathri Ramana)సాయి కామాక్షి భాస్కర్ల (Sai Kamakshi Bhaskarla)ప్రధాన పాత్రలలో బాల సతీష్ (Director Bala Sateesh)దర్శకత్వం లో కనకమేడల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజేష్ నిర్మిస్తున్న సినిమా ‘మెన్షన్ హౌస్ మల్లేష్’. (Mansion House Mallesh)ఇప్పటికే విడుదలలై ఈ సినిమా ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా హీరో అడివి ఈ సినిమా ఫస్ట్ సింగిల్ బంగారి బంగారి సాంగ్ ని లాంచ్ చేశారు.
మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి ఈ పాటని లవ్లీ మెలోడీగా కంపోజ్ చేశారు. హరిణి ఇవటూరి సోల్ ఫుల్ వోకల్స్ ప్లజెంట్ గా వుంది. సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అద్భుతంగా వున్నాయి. ఈ సాంగ్ లో లీడ్ పెయిర్ కెమిస్ట్రీ చాలా బ్యూటీఫుల్ గా వుంది.
ఈ చిత్రానికి ప్రముఖ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. సురేష్ బొబ్బిలి మ్యూజిక్ అందిస్తున్నారు. అమ్మముత్తు డీవోపీ కాగా, గ్యారీ BH ఎడిటర్ బాధ్యతలు నిర్వహించారు.
త్వరలోనే ఈ మూవీ థియేటర్స్ లోకి రానుంది.