Mahesh Babu: మహేష్ ఫ్యాన్స్ కు గిఫ్ట్ ప్లాన్ చేసిన జక్కన్న

ఏదేమైనా రాజమౌళి(Rajamouli) సినిమాలకు మీడియాలో ఉండే హడావుడి వేరుగా ఉంటుంది. ఆయన సినిమా చేస్తున్నారని ప్రకటించిన దగ్గర నుంచి సోషల్ మీడియా షేక్ అయిపోతూ ఉంటుంది. సోషల్ మీడియాలో రాజమౌళి అభిమానులతో పాటుగా సినీ పిచ్చోళ్ళు కూడా ఎక్కువగా హడావిడి చేస్తూ ఉంటారు. ప్రస్తుతం మహేష్ బాబు(Mahesh Babu)తో రాజమౌళి సినిమా చేస్తున్నారు. ఈ సినిమా గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే సోషల్ మీడియాలో హడావుడి ఓ రేంజ్ లో ఉంటుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాదులోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది.
ప్రియాంక చోప్రా, మహేష్ బాబు మధ్య కొన్ని కీలక సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. ఇక త్వరలోనే ఇక్కడ షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే కెన్యా బయలుదేరి వెళుతుంది మూవీ యూనిట్. వచ్చేయేడాది సంక్రాంతికి ఎలాగైనా సరే ఈ సినిమా ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేయాలని రాజమౌళి టార్గెట్ పెట్టుకున్నారు. అందుకే ఈ సినిమా షూటింగ్ ఎక్కడా డిలే అవడం లేదు. ఇక హైదరాబాదులో షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే సినిమా గురించి ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.
ఈ మీడియా సమావేశంలో కీలక విషయాలను రాజమౌళి స్వయంగా ప్రకటిస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ మీడియా సమావేశంలోనే టైటిల్ కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉండొచ్చని వార్తలు ఊపందుకున్నాయి. గతంలో కంటే ప్రస్తుతం రాజమౌళి చేస్తున్న ఈ సినిమా చాలా డిఫరెంట్ గా కనబడుతోంది. ఎప్పుడు లేని విధంగా స్పీడ్ గా షూటింగ్ కంప్లీట్ చేస్తున్నారు రాజమౌళి. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ లో వస్తుంది. ఇక నిర్మాత కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పెట్టుబడి పెడుతున్నారు. మరి మీడియా సమావేశం ఎప్పుడు ఏర్పాటు చేస్తారు అనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. ఇక ఈ సినిమా టైటిల్ గరుడ అనే టాక్ కూడా వినపడింది.