Balakrishna: బాలకృష్ణతో టాలీవుడ్ కు ఎంట్రీ..?

అఖండ సినిమా తర్వాత నుంచి నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) రేంజ్ మారిపోయింది. ఆయన ఏ సినిమా చేసిన సరే హిట్ అయిపోతుంది. పట్టిందల్లా బంగారం అయిపోతుంది బాలయ్యకు. దీనితో అభిమానులు కూడా ఇప్పుడు బాలయ్యను చూసి గర్వపడుతున్నారు. ఒకప్పుడు సినిమాల సెలక్షన్ విషయంలో బాలయ్య పెద్దగా ఫోకస్ పెట్టేవారు. స్టోరీ లైన్ ఎలా ఉన్నా సరే సినిమా చేసేవారు బాలకృష్ణ. దీంతో ఆయన కెరీర్ ఒకప్పుడు ఇబ్బందులు పడింది. అభిమానులు కూడా ఆయన సినిమాలు చూడలేని పరిస్థితి.
అయితే అఖండ సినిమా తర్వాత నుంచి బాలకృష్ణ రూట్ మార్చారు. స్టోరీ లైన్ పై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. ఏ సినిమా పడితే ఆ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు బాలకృష్ణ. ఇప్పుడు బాలయ్య.. అఖండ సీక్వెల్లో (Akhanda 2) నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ 50% కంప్లీట్ అయిపోయింది. షూటింగ్ కు బాలయ్య బ్రేక్ ఇవ్వడం లేదు. ఇక బాలయ్య పోర్షన్ త్వరలోనే కంప్లీట్ చేయాలని డైరెక్టర్ బోయపాటి టార్గెట్ పెట్టుకున్నాడు. కృష్ణాజిల్లాలో త్వరలోనే సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది.
ఇక ఈ సినిమా తర్వాత యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో బాలయ్య ఒక సినిమా చేస్తారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్టు టాక్. ఇక ఇప్పుడు హరీష్ శంకర్ డైరెక్షన్ లో చేయబోయే సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాను బాలయ్య ఆల్మోస్ట్ ఫైనల్ చేసినట్టు సమాచారం. బాలయ్య చిన్న కుమార్తె తేజస్వినికి కథ నచ్చిందట. దీనితో వెంటనే ఆ స్టోరీకి బాలయ్య ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అన్ని అనుకున్నట్టు జరిగితే సెప్టెంబర్ లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే ఛాన్స్ ఉంది.
ఈ సినిమాను కన్నడ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించే ఛాన్స్ కనబడుతోంది. ఈ సినిమాతో గ్రాండ్ గా టాలీవుడ్ లో అడుగు పెట్టాలని భావిస్తున్నారట ఆ నిర్మాణ సంస్థ అధినేతలు. ఇప్పటికే బాలయ్య స్టోరీ కూడా వినేశారని ఇక కేవీఎన్ ప్రొడక్షన్స్ కూడా బాలకృష్ణ కాబట్టి తెలుగులో ఎంట్రీ గ్రాండ్ గా ఉంటుందని ప్లాన్ చేసుకున్నట్టు టాక్.