Karan Johar: రాజమౌళిని బుట్టలో వేస్తున్నడా…??

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ఇప్పుడు బాలీవుడ్ వదిలి బయటకు వచ్చి ఆలోచనలో ఉన్నాడు. తెలుగు సినిమాల వైపు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు ఈ స్టార్ ప్రొడ్యూసర్. దేవరా సినిమా విషయంలో భయపడకుండా ఎక్కువ ఖర్చు పెట్టాడు. హిందీ రైట్స్ కోసం ఇక ఇప్పుడు తెలుగులో డైరెక్ట్ గా ఒక సినిమాను ప్రొడ్యూస్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) హీరోగా వచ్చిన లైగర్ సినిమాను కరణ్ జోహార్ నిర్మించాడు. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేదు.
అయినా సరే కరణ్ మాత్రం వెనక్కి తగ్గే ఆలోచనలో లేడు అనే సిగ్నల్స్ వస్తున్నాయి. తాజాగా రాజమౌళిని దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. రాజమౌళితో ఎలాగైనా సరే సినిమా చేయాలని, ఇప్పుడే ఒప్పందం చేసుకోవాలని కరణ్ జోహార్ ప్రయత్నం చేస్తున్నట్టుగా అర్థమవుతోంది. రాజమౌళి సినిమాలకు లాజిక్ అవసరం లేదని, కదా ఎలా ఉన్నా సరే ప్రేక్షకులు ఆదరిస్తారని, గొప్ప దర్శకుల సినిమాలకు లాజిక్ తో పనిలేదని కామెంట్ చేసాడు.
ఈ కామెంట్స్ చూస్తున్న టాలీవుడ్ జనాలు కచ్చితంగా కరణ్ జోహార్.. రాజమౌళి(Rajamouli)తో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని అంటున్నారు. అలాగే మహేష్ బాబు(Mahesh Babu) తో చేస్తున్న సినిమా హిందీ రైట్స్ కోసం కరణ్ జోహార్ ఇప్పటి నుంచే ట్రైల్స్ మొదలు పెట్టాడని, అందుకే రాజమౌళి పై ప్రశంసలు కురిపించాడని కూడా అంటున్నారు. ప్రస్తుతం కరుణ్.. తమిళంలో కూడా ఒక సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సైలెంట్ గా సౌత్ ఇండియా సినిమాపై కాస్త ఫోకస్ పెంచుతున్నాడు. ఇటీవల అతను వైజాగ్ లో స్టూడియో నిర్మించే ఆలోచనలో కూడా ఉన్నాడని.. దీనికోసం ఏపీ ప్రభుత్వంతో సంప్రదింపులు కూడా జరుపుతున్నాడని ప్రచారం జరిగింది. అయితే దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు.