Kajal Agarwal: ట్రెండీ ఔట్‌ఫిట్ లో కాజల్ సొగసులు

కాజల్ అగర్వాల్(Kajal Agarwal).. టాలీవుడ్ చందమామ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. లక్ష్మీ కల్యాణం(Lakshmi Kalyanam) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కాజల్, తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి సౌత్ స్టార్ హీరోయిన్ గా కొన్నాళ్ల పాటూ ఓ వెలుగు వెలిగింది. తన అందం, అభినయంతో ఎంతో మంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్న కాజల్, నాలుగు పదుల వయసులో కూడా ఎంతో అందంగా కనిపిస్తూ ఫాలోవర్లను ఆకట్టుకుంటుంది. సినిమాల సంగతి పక్కనపెడితే కాజల్ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ను అందిస్తూ ఉంటుంది. అందులో భాగంగానే తాజాగా కాజల్ బ్లాక్ అండ్ వైట్ ట్రెండ్ ఔట్‌ఫిట్ ధరించి మరింత అందంగా కనిపిస్తూ లుక్స్ తోనే మెస్మరైజ్ చేసింది. ఈ ఫోటోల్లో కాజల్ లుక్స్, ఎక్స్‌ప్రెషన్స్ చూసి నెటిజన్లు ఫిదా అయిపోతూ ఆ ఫోటోలను నెట్టింట వైరల్ చేస్తున్నారు.